వైద్యుల నిర్లక్ష్యంతో తల్లి కడుపులోనే పసికందు మృతి..

మెదక్ జిల్లాలో దారుణం జరిగింది...వైద్యల నిర్లక్ష్యంతో తల్లి కడుపులోనే పసిపాప మృతి చెందింది. శనివారం ( అక్టోబర్ 5, 2024 ) చోటు చేసుకుంది ఈ ఘటన. జిల్లాలోని కొల్చారం మండలం చిన్న ఘనపూర్ గ్రామనికి చెందిన వడ్డే గీత( 29) అనే మహిళ వైద్య పరీక్షల కోసం మెదక్ జిల్లా కేంద్రంలోని మాత శిశు సంక్షేమ ఆసుపత్రికి రాగా.. తల్లి కడుపులోనే శిశువు మృతి చెందినట్లు సమాచారం.

బాధితురాలు మొదట సెప్టెంబర్ 29వ తేదీన చికిత్స కోసం వచ్చిందని..  మళ్ళీ శనివారం ( అక్టోబర్ 5, 2024 ) రోజున  వైద్య పరీక్షలు కోసం రాగ  శిశువు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయం పై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు.డాక్టర్లు నిర్లక్ష్యం వల్లే పసిపాప మృతి చెందిదని బంధువులు ఆరోపిస్తున్నారు.

ALSO READ | పిచ్చి కుక్క దాడి.. ఇద్దరికి తీవ్రగాయాలు