ENG vs PAK 1st Test: బ్యాటింగే కాదు ఫీల్డింగ్ కూడా రాదు: చేతిలో క్యాచ్ మిస్ చేసిన బాబర్

ముల్తాన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ తీవ్ర విమర్శలకు గురవుతున్నాడు. అసలు వికెట్ కోసం పాక్ బౌలర్లు శ్రమిస్తుంటే చేతిలోకి వచ్చిన ఈజీ క్యాచ్ మిస్ చేశాడు. రూట్ 186 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద నసీమ్ షా బౌలింగ్‌లో జో రూట్ క్యాచ్‌ను బాబర్ ఆజం మిస్ చేశాడు. రూట్ డీప్ మిడ్ వికెట్ దిశగా షాట్ ఆడగా అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న బాబర్ చేతిలో పట్టుకొని జారవిడిచాడు. అసలే ఫామ్ లేని బాబర్ తీవ్ర విమర్శల పాలవుతుంటే క్యాచ్ మిస్ చేయడం పాక్ అభిమానాలు జీర్ణించుకోలేకపోతున్నారు.   

ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న రూట్ డబుల్ సెంచరీ బాదేశాడు. ఆ తర్వాత మరింత జోరు పెంచి 262 పరుగుల వద్ద ఔటయ్యాడు.    ఈ నేపథ్యంలో అభిమానులు సోషల్ మీడియా వేదికగా పాకిస్థాన్ మాజీ కెప్టెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాటింగ్ రాదు ఫీల్డింగ్ రాదు  అని కొంతమంది అంటుంటే.. చేతిలోకి వచ్చిన క్యాచ్ ను ఎలా మిస్ చేస్తావని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. గత రెండేళ్లుగా బాబర్ కు టెస్ట్ క్రికెట్ లో హాఫ్ సెంచరీ లేదు. 

Also Read:-ట్రిపుల్ సెంచరీతో బ్రూక్ విశ్వరూపం.. 800 పరుగుల దిశగా ఇంగ్లాండ్

ప్రస్తుతం ముల్తాన్ వేదికగా జరుగుతున్న వికెట్ బ్యాటింగ్ కు అనుకూలిస్తున్న 30 పరుగులు మాత్రమే చేశాడు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. నాలుగో రోజు టీ విరామానికి ముందు 7 వికెట్ల నష్టానికి 817 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీ చేసి ఔటయ్యాడు. రూట్ 262 పరుగులు చేశాడు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు ఏకంగా 452 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. పాకిస్థాన్ తమ తొలి ఇన్నింగ్స్ లో 556 పరుగులకు ఆలౌట్ అయింది.