న్యూజెర్సీలో ఘనంగా అయ్యప్పస్వామి పడిపూజ

హైదరాబాద్ సిటీ, వెలుగు: అమెరికాలోని న్యూజెర్సీలోని సాయిదత్త పీఠం ఆధ్వర్యంలో శివవిష్ణు ఆలయంలో అయ్యప్పస్వామి పడిపూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గురుస్వాములు రఘుశర్మ శంకరమంచి, అశోక్ వల్లెపు, సుమన్ నిమ్మల, విలాస్ రెడ్డి జంబుల, వెంకట్ రెడ్డి మూలం, భరత్ శ్యామ్, శ్రీకాంత్ భోగరాజు, రాజేశ్ రెడ్డి, గుడిబండి ల ఆధ్వర్యంలో ఈ పడిపూజ నిర్వహించారు.

పూజా ప్రాంగణం అంతా ‘స్వామియే శరణమయ్యప్ప’  అంటూ అయ్యప్ప శరణుగోషతో  మార్మోగింది. స్వామివారికి పుష్పాభిషేకం, పంచామృతం, చందనం, విభూతితో అభిషేకం నిర్వహించారు. స్వామివారికి పొంగల్‌‌ను నైవేద్యంగా సమర్పించారు. ఇదే ఆలయంలో ఈ నెల 25న ఇరుముడి పూజా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇక్కడ ఏటా కార్తీకమాసంలో ప్రవాస భారతీయులు  అయ్యప్పమాల ధరిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో అశోక్, సుమన్, ఉపేంద్ర చివుకుల, కృష్ణా రెడ్డి, ఏనుగుల, సుధాకర్ ఉప్పల, దాము గేదెల, రామ్మోహన్ ఎల్లంపల్లి, రాజ్, అమర్ జునూతుల, ప్రుధేష్ మక్కపాటి, సంతోష్ కోరం, రాణి మాత, హేమ, శ్రుతి, వాసవి, మాధురి, రాధిక తదితరులు పాల్గొన్నారు.