అయ్యప్ప స్వాముల బస్సుకు మంటలు.. 50 మందికి తప్పిన ప్రమాదం

ఏపీ రాష్ట్రం.. విజయనగరం జిల్లా నుంచి శబరిమల వెళ్లిన అయ్యప్ప భక్తులకు ప్రమాదం తప్పింది. రేగిడి మండలం మజ్జిరాయుడుపేటకు చెందిన 50 మంది అయ్యప్ప స్వాములు.. స్వామి దర్శనం కోసం ఓ ప్రైవేట్ బస్సు మాట్లాడుకుని వెళ్లారు. అప్పయ్యస్వామి దర్శనం అనంతరం తిరుగుప్రయాణం అయ్యారు. 

వీరి బస్సు తమిళనాడు రాష్ట్రం కంచికి వచ్చింది. కంచిలో రోడ్డు పక్కన బస్సు నిలిపి.. ఆ బస్సు పక్కన వంట ఏర్పాటు చేశారు. వంట చేస్తున్న సమయంలో.. నిప్పు రవ్వలు ఎగిసి.. బస్సుపై పడ్డాయి. ఆ వెంటనే మంటలు బస్సు అంతా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో బస్సు మొత్తం పూర్తిగా కాలిపోయింది. 

ALSO READ : 108, 104 సేవలకు అరబిందో గుడ్ బై

ప్రమాదాన్ని గుర్తించి మంటలు ఆర్పటానికి ప్రయత్నించినా ఫలితం లేదు. ఈ ఘోర ప్రమాదం నుంచి 50 మంది అయ్యప్పస్వాములు సురక్షితంగా.. ప్రాణాలతో బయటపడ్డాయి. అయితే వీరి వస్తువులు అన్నీ కూడా కాలిబూడిద అయ్యాయి. ప్రమాద విషయాన్ని బస్సులోని అయ్యప్పభక్తులు తమ వారికి ఫోన్లు చేసి చెప్పటంతో బయటకు వచ్చింది. తమిళనాడు కంచిలో ఉన్న 50 మంది అయ్యప్ప భక్తులు తమ ఊరికి చేరుకోవటానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కట్టుబట్టలతో ఉండటం.. వస్తువులన్నీ కాలిపోవటంతో ఇబ్బందులు పడుతున్నట్లు చెబుతున్నారు భక్తులు.