అయ్యప్ప దీక్ష: ఓ పక్క ఆధ్యాత్మికం.. మరో పక్క ఆరోగ్యం..

కార్తీకమాసం వచ్చిదంటే ఓ పక్క శివాలయాలు కిటకిటలాడతాయి.  విష్ణుభక్తులు కూడా బిజీ అవుతారు.  ఇక దేశవ్యాప్తంగా స్వామియే శరణం అయ్యప్ప అంటూ...మారుమ్రోగుతోంది. అయ్యప్పదీక్షా నియమాలకుదీక్షతో ఆరోగ్యం.. ఆధ్యాత్మికత చేకూరుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

 కేరళ రాష్ట్రంలో ప్రారంభమైన అయ్యప్ప దీక్ష నేడు దక్షిణ భారతదేశమంతటా విస్తరించింది. అన్ని ప్రాంతాల కంటే తెలుగు రాష్ట్రాల్లోనే అయ్యప్ప దీక్ష తీసుకున్న వారు కఠిన నియమాలు ఆచ రిస్తూ దీక్షా కాలాన్ని పరిపూర్ణం గావిస్తారనే మంచి పేరుంది.అయ్యప్ప దీక్ష మతసామరస్యానికి ప్రతీక. కులం, మతం, చిన్న, పెద్దా తేడా లేకుండా ప్రతి వ్యక్తిని దైవ స్వరూపంగా భావించడ మే దీక్ష పరమార్థం. దీని ద్వారా ఆధ్యాత్మిక చింతన పెరగడమే కాకుండా దురలవాట్లకు దూరమై, సంపూర్ణ ఆరోగ్యం, క్రమశిక్షణతో కూడిన జీవన విధానం అలవడుతుంది.

also read :- ఇక వారికి తిరుమల శ్రీవారి కళ్యాణం టికెట్ఈజీ.. ఎవరి కంటే

అయ్యప్ప దీక్షతో ఆరోగ్యం...

అయ్యప్ప మండల దీక్షతో ఆధ్యాత్మిక చింతన తో పాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. శాస్ర్తీ య పద్ధతుల ప్రకారం పురాతన కాలం నుంచి కొన్ని రకాలైన వ్యాధులకు ఆయుర్వేద చికిత్స చేయడానికి, యోగ సాధనకు మండల కాలం (41 రోజులు) ప్రామాణికంగా వాడుతున్నారు. చన్నీటి స్నానం, ఒక్క పూట భోజనం, దేవతా రాధన వంటి అలవాట్లు మనిషి జీవితంపై చక్క టి ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఉద యం, సాయంత్రాలలో చన్నీటి శిర స్నానాలు చేయడం వల్ల మెదడులోని సున్నిత నరాలు స్పందించి సునిశిత శక్తి, ఏకాగ్రత, ఉత్తేజం కలగడమే కాకుండా శరీరంలోని వేడి కూడా సమతుల్యమవుతుంది. నుదుటిపై చందనం, కుంకుమ, విభూతి ధరించడం వల్ల భృగు మధ్య భాగంలోని అతి సున్నిత నరాలకు చల్ల దనాన్ని ఇవ్వడమే గాక గంధం సువానస మానసిక ప్రశాంతతనిస్తుంది.

వనమూలికల తో తయారయ్యే విభూతి యాంటీబాక్టీరియల్‌ గా పనిచేసి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుం ది. దీక్షా కాలంలో ధరించే నలుపు రంగు బట్టలు వేడిని గ్రహించి దేహానికి వెచ్చదనాన్ని ఇస్తా యి. కాళ్లకు చెప్పులు ధరించకుండా నవడవడం వల్ల భూమిపై ఉండే చిన్న చిన్న రాళ్లు, మట్టి గడ్డలు పాదాలకు సున్నితంగా గుచ్చుకుని ఓ రకంగా ఆక్యూపంక్చర్‌ చర్య జరిగి నరాలకు స్పందన కలుగుతుంది. దాంతో శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఒంటి పూట భోజనం చేయడం వల్ల జీర్ణవ్యవస్థ క్రమబద్ధీకరించబడుతుంది. అయ్యప్ప దీక్షతో మానసిక, శారీరక ఉత్తేజం కలిగి అత్మస్థైర్యం, ఏకాగ్రత పెంపొందుతాయి.