ఆయుష్, హోమియోపతి డాక్టర్లు కరోనా చికిత్సకు మందులు సూచించడం గానీ.. వాటిని ప్రచారం చేయడం గానీ చేయకూడదని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇటువంటి ప్రిస్కిప్టన్లను నిషేధిస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవరించేందుకు నిరాకరించింది. కరోనా క్రమంలో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఆయుష్ డాక్టర్లకు కేంద్రం ఇచ్చిన సూచనలను కోర్టు సమర్ధించింది. కేరళ హైకోర్టు ఆగస్టు 21న వెలువరించిన తీర్పునకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ పై స్పందించిన కోర్టు ఆ ఉత్తర్వులను సవరించడానికి నిరాకరించింది. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సుబాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పును మంగళవారం వెలువరించింది. డాక్టర్ ఏకేబీ సద్భావనా మిషన్సూ్కూల్ ఆఫ్ హోమియోపతి ఈ పిటిషన్ ను దాఖలు చేసింది.
ఆయుష్, హోమియోపతి డాక్టర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వం ఆమోదించిన మెడిసిన్లను రోగనిరోధక శక్తి పెంపొందించుకునేందుకు మాత్రమే సూచించవచ్చని… చికిత్సలో భాగంగా ప్రిస్కైట్ చేయొద్దని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సూచించింది.
