కాళోజీ హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్సిటీలో ఆయుష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడ్మిషన్స్​

వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్- 2024-–25 విద్యా సంవత్సరానికి యూజీ ఆయుష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్స్​కు అప్లికేషన్స్​ కోరుతోంది.  ప్రభుత్వ, ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలేజీల్లో కన్వీనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు. 

అర్హత: ఇంటర్మీడియట్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ)తో పాటు నీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూజీ-2024 స్కోరు తప్పనిసరి. వయసు 31 డిసెంబర్​ 2024 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. నీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూజీ-2024 స్కోరు, రూల్ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్స్​: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో అక్టోబర్​ 13 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.2500, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.2000 చెల్లించాలి. పూర్తి వివరాలకు www.knruhs.telangana.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.