ఆసియా టీటీలో కొత్త చరిత్ర

  • తొలిసారి సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేరి పతకం ఖాయం 
  • చేసుకున్న ఇండియా అమ్మాయిలు

ఆస్టానా : ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెన్నిస్ టీమ్ ఆసియా టీటీ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చరిత్ర సృష్టించింది. మెగా టోర్నీలో తొలిసారి సెమీఫైనల్ చేరి పతకం ఖాయం చేసుకుంది. మంగళవారం జరిగిన క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో ఇండియా 3–2తో పారిస్ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంస్య పతక విజేత సౌత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొరియాపై ఉత్కంఠ విజయం సాధించింది. వరల్డ్ 92 ర్యాంకర్ ఐహికా ముఖర్జీ..  ఎనిమిదో ర్యాంకర్ షిన్ యుబిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 16వ ర్యాంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జియోన్ జిహీని ఓడించి ఔరా అనిపించింది. 

తొలి సింగిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఐహికా  11-–9, 7-–11, 12-–10, 7-–11, 11–-7   యుబిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓడించగా, రెండో పోరులో మనిక బత్రా  12–-14, 13-–11, 11–-5, 5-–11, 12–-10  జియో జిహీపై నెగ్గడంతో ఇండియా 2–0తో ఆధిక్యంలోకి వచ్చింది. కానీ, ఇండియా టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ర్యాంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆకుల శ్రీజ  6–-11, 10-–12, 8-–11తో  వరుస గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లీ ఎయున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హీ చేతిలో ఓడగా..

రివర్స్ సింగిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో యుబిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  13-–11, 11-–4, 6-–11, 7-–11, 12-–10  తో మనికను ఓడించి స్కోరు 2–2తో సమం చేసింది. నిర్ణాయక, రెండో రివర్స్ సింగిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  అద్భుతంగా ఆడిన ఐహిక 7–-11, 11–-6, 12-–10, 12-–10   జిహీని ఓడించి ఇండియాను గెలిపించింది.