న్యూఢిల్లీ : లైఫ్ సైన్సెస్ ఎంటర్‌ప్రైజెస్‌లకు ఏఐ ఆధారిత సేవలను అందించడానికి న్యూజెర్సీకి చెందిన ఐటీ సంస్థ ఆక్స్ట్రియా తన తొమ్మిదో గ్లోబల్ ఇన్నోవేషన్ కేపబిలిటీ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది.
ఈ ఇన్నోవేషన్ సెంటర్ డేటా అనలిటిక్స్ ఇన్‌సైట్‌ల ద్వారా గ్లోబల్ ఫార్మా, లైఫ్-సైన్సెస్ కంపెనీలకు సహాయం చేస్తుంది. ఆక్స్ట్రియా రాబోయే 9-–12 నెలల్లో దాదాపు 800 మంది నిపుణులను నియమించుకోనుంది.
