న్యూఢిల్లీ: సిటీ బ్యాంక్ రిటైల్ బిజినెస్‌లను కొనుగోలు చేయడంలో యాక్సిస్ బ్యాంక్ హయ్యస్ట్ బిడ్డర్‌గా నిలిచింది. సిటీ బ్యాంక్ రిటైల్ బిజినెస్ వాల్యుయేషన్ రూ. 13,000 కోట్లు (2 బిలియన్ డాలర్లు) గా ఉంటుందని అంచనా. గ్లోబల్ స్ట్రాటజీలో భాగంగా దేశంలోని రిటైల్ బ్యాంకింగ్ నుంచి ఎగ్జిట్ అవుతామని ఈ ఏడాది ఏప్రిల్‌లో సిటీ గ్రూప్ ప్రకటించింది. రిటైల్ బిజినెస్‌లలో క్రెడిట్ కార్డులు, రిటైల్ బ్యాంకింగ్ సర్వీస్‌లు, హోమ్ లోన్స్, వెల్త్ మేనేజ్‌మెంట్ వంటి సెగ్మెంట్లు కలిసి ఉంటాయి. సిటీ బ్యాంక్‌కు దేశంలో 35 బ్రాంచులు ఉన్నాయి. మొత్తం 4 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. సిటీ బ్యాంక్ రిటైల్ బిజినెస్ వాల్యుయేషన్‌ను లెక్కించేటప్పుడు డిపాజిట్లు, కస్టమర్లు, అసెట్స్, లయబిలిటీస్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ డీల్ పూర్తయితే యాక్సిస్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ అమాంతం పెరుగుతుందని ఎనలిస్టులు పేర్కొన్నారు. కాగా, సిటీ గ్రూప్ 1902 లో ఇండియాలోకి ఎంటర్ అయ్యింది. 1985 లో రిటైల్ బ్యాంకింగ్ బిజినెస్‌ను స్టార్ట్ చేసింది. 2019–20 లో సిటీ బ్యాంక్‌కు రూ. 4,912 కోట్ల ప్రాఫిట్ రాగా, 2020–21 లో రూ. 4,093 కోట్లకు నికర లాభం తగ్గింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి, సిటీ బ్యాంక్ నెట్ ఎన్‌పీఏలు రూ. 143.34 కోట్లుగా, గ్రాస్ ఎన్‌పీఏలు రూ. 990.94 కోట్లుగా ఉన్నాయి. రిటైల్ బిజినెస్‌ను అమ్మేసినా, ఇన్‌స్టిట్యూషనల్ బ్యాంకింగ్ బిజినెస్‌లో సిటీ గ్రూప్ కొనసాగుతుంది.
