BGT 2024-25: కారణం లేకుండా పక్కన పెట్టారు: ఆస్ట్రేలియా టూర్‌కు ఆ ఒక్కడికి అన్యాయం

ఆస్ట్రేలియా వేదికగా నవంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 కోసం బీసీసీఐ అక్టోబర్ 25న భారత జట్టును ప్రకటించింది. మొత్తం 18 మంది ప్లేయర్లతో టీమిండియా స్కాడ్‎ను బీసీసీఐ అనౌన్స్ చేసింది. ఆసీస్‎తో జరగనున్న ఈ హై వోల్టేజ్ సిరీస్‎కు రోహిత్ శర్మ కెప్టెన్‎గా వ్యవహరించనుండగా.. స్టార్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రా వైస్ కెప్టెన్‎గా ఎంపికయ్యాడు. సర్ఫరాజ్ ఖాన్, జైశ్వాల్, నితీష్ కుమార్ రెడ్డి తొలిసారి ఆస్ట్రేలియా టూర్ కు స్థానం సంపాదించారు. అయితే భారత ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ను సెలక్ట్ చేయకుండా తీవ్ర అన్యాయం చేసినట్టు తెలుస్తుంది. 

అక్షర్ పటేల్ కు టెస్ట్ క్రికెట్ లో ఆల్ రౌండే గా అద్భుతమైన రికార్డ్ ఉంది. అతను 14 టెస్టుల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అవకాశం వచ్చినప్పుడల్లా తనను తాను నిరూపించుకున్నాడు. బ్యాటింగ్ లో 35 యావరేజ్ తో 646 పరుగులు.. బౌలింగ్ లో బౌలింగ్ లో 19 యావరేజ్ తో 55 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఓ వైపు బ్యాటింగ్ లో అదరగొడుతూనే మరోవైపు బ్యాటింగ్ లో కీలక ఇన్నింగ్స్ లు ఆడాడు. అద్భుతమైన రికార్డ్ ఉన్నప్పటికీ ఆస్ట్రేలియా టూర్ కు ఎంపిక చేయబడ్డ 18 మంది ప్రాబబుల్స్ లో చోటు దక్కలేదు. 

Also Read :- భారత్ ఇప్పుడు నిద్ర నుంచి లేచిన సింహం

చివరిసారిగా జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అక్షర్ పటేల్ 5 ఇన్నింగ్స్ ల్లో మూడు హాఫ్ సెంచరీలు చేశాడు. మిగిలిన రెండు ఇన్నింగ్స్ ల్లో నాటౌట్ గా నిలిచాడు. న్యూజిలాండ్ ఇటీవలే ముగిసిన టెస్ట్ సిరీస్ లోనూ అక్షర్ కు ఒక్క మ్యాచ్ లోనూ ఆడే అవకాశం రాలేదు. దీంతో అతడికి తీవ్ర అన్యాయం జరిగిందని నెటిజన్స్ మండిపడుతున్నారు. బాగా ఆడుతున్న ప్లేయర్లను సెలక్ట్ చేయకపోతే వారి ఆత్మవిశ్వాసం దెబ్బ తింటుందని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం టీమిండియా టెస్టుల్లో పేలవ ఫామ్ లో ఉంది. ఏ సమయంలో కూడా అక్షర్ పటేల్ కు ఛాన్స్ ఇవ్వకపోవడం విచారం కలిగించేదే. 

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్ , విరాట్ కోహ్లీ , కెఎల్ రాహుల్ , రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, ఆర్ జడేజా, మొహమ్మద్. సిరాజ్, ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.