Team India: తండ్రి కాబోతున్న భారత అల్ రౌండర్

టీమిండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ తండ్రి కాబోతున్నాడు. అతని భార్య మేహా మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు స్పష్టం చేశాడు. సోమవారం(అక్టోబర్ 7) ఇంస్టాగ్రామ్ వేదికగా అతను అధికారికంగా ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. ఈ వీడియోలో త్వరలో తమ జీవితాల్లో ఆనందం రాబోతుందని ఎమోషనల్ అయ్యాడు. అక్షర్, మేహా జనవరి 2023లో వివాహం చేసుకున్నారు. ఇటీవలే బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ స్క్వాడ్ లో అక్షర్ పటేల్ ఎంపికైనా రెండు టెస్టుల్లో ఆడే అవకాశం రాలేదు. 

2024 టీ20 వరల్డ్ కప్ భారత్ గెలుచుకోవడంలో అక్షర్ పటేల్ కీలక పాత్ర పోషించాడు. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 31 బంతుల్లో 47 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

Also Read : కమ్మిన్స్ ప్లేస్‌లో రోహిత్

ఈ ఇన్నింగ్స్ తో ఒక్కసారిగా ఈ ఆల్ రౌండర్ మారుమ్రోగిపోయాడు. ప్రస్తుతం అక్షర్ స్వదేశంలో న్యూజి లాండ్ తో టెస్ట్ సిరీస్ కు సిద్ధమవుతున్నాడు. ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్నాడు. 2025 ఐపీఎల్ లో అతన్ని ఢిల్లీ  రిటైన్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.