కిడ్నీ వ్యాధులపై అవగాహన ఉండాలి

  •  క్రానిక్ కిడ్నీ డిసీజ్ క్లినిక్ ‌ఓపెన్ చేసిన​ యశోద హాస్పిటల్స్

మాదాపూర్​, వెలుగు :  కిడ్నీ సంబంధిత బాధితులు రోజురోజుకూ పెరుగుతున్నారని, ఈ వ్యాధులపై అందరికీ అవగాహన ఉండాలని యశోద హాస్పిటల్స్​ గ్రూప్స్​ చైర్మన్​ గోరుకంటి రవీందర్​రావు  అన్నారు. జగద్గురువు శివరాత్రి దేశికేంద్ర మహాస్వామీజీ, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్. దేవదాస్, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరితో కలిసి హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ గోరుకంటి రవీందర్ రావు క్రానిక్ కిడ్నీ డిసీజ్ క్లినిక్​ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ...  ప్రతీసంవత్సరం దాదాపు 5 లక్షల మంది కొత్త కిడ్నీ రోగులు డయాలసిస్ దశకు చేరుకుంటున్నారని పేర్కొన్నారు.  తెలుగు రాష్ట్రాల్లో జనాభాలో 20% కంటే ఎక్కువ మందిలో ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ కు గురవుతున్నారని చెప్పారు.

ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని  క్లినిక్ ‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం యశోద హాస్పిటల్స్- సీనియర్ నెఫ్రాలజిస్ట్ , కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్. రాజశేఖర చక్రవర్తి  సీనియర్ నెఫ్రాలజిస్ట్ కన్సల్టేషన్ ‌తో సహా ప్రోటోకలైజ్డ్ కేర్, డైటీషియన్ అత్యాధునిక పరికరాలు, మందులను ఉపయోగిస్తామని తెలిపారు.