కొత్తచట్టాలపై అవగాహన కల్పించాలి: జడ్జి లక్ష్మీనారాయణ

వనపర్తి, వెలుగు: సవరణ చేసిన మూడు కొత్త చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని హైకోర్టు జడ్జి, వనపర్తి కోర్టు అడ్మినిస్ట్రేటివ్​ జడ్జి లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. శనివారం ఆయన వనపర్తి కోర్టులో జరిగిన జ్యుడీషియల్​ కాన్ఫరెన్స్​కు హాజరయ్యారు. 

కోర్టు లైబ్రరీ, విట్ నెస్​ రూమ్​లను ఆయన ప్రారంభించారు. బార్​ అసోసియేషన్​ బిల్డింగ్​ను సందర్శించి మాట్లాడారు. మూడు చట్టాల్లో వచ్చిన మార్పులను కింది స్థాయి సిబ్బందికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.  న్యాయమూర్తులు, లాయర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ప్రజలకు అర్థమయ్యేలా చూడాలన్నారు. జిల్లా ఇంటిగ్రేటెడ్​ కోర్టు కొత్త భవనానికి, సెకండ్​ క్లాస్​ మెజిస్ట్రేట్​ కోర్టు ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానన్నారు. 

జిల్లా జడ్జి సునీత, సబ్​ జడ్జి రజని, జూనియర్​ జడ్జీలు రవికుమార్, జానకి, శ్రీలత, ఆత్మకూరు జడ్జి శిరీష, బార్​ అసోసియేషన్​ ప్రెసిడెంట్​ మోహన్​కుమార్​ యాదవ్, ప్రధానకార్యదర్శి బాలనాగయ్య, అడ్వకేట్లు నాగేశ్వర్, పురుషోత్తం, శ్రీనివాసాచారి, భరత్​కుమార్ పాల్గొన్నారు.