ఎన్​హెచ్​ఆర్సీ జిల్లా అధ్యక్షుడిగా రాజేశ్

నస్పూర్, వెలుగు : నేషనల్​హ్యూమన్ ​రైట్స్​ సంస్థ (ఎన్ హెచ్ఆర్సీ) మంచిర్యాల జిల్లా ప్రెసిడెంట్​గా ఆవుల రాజేశ్ యాదవ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాజేశ్​యాదవ్​ మాట్లాడుతూ.. తనను జిల్లా ప్రెసిడెంట్​గా నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డికి

నేషనల్ చైర్మన్ మహమ్మద్ యాసిన్​కు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్తా నని, ప్రభుత్వ పథకాలు పేదలకు దక్కేలా కృషి చేస్తానన్నారు.