రీజన్ ఏదైనా కావొచ్చు 2019 నుంచి 2020 వరకు ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయిందని సీఎంఆర్ – వివో సంస్థ తెలిపింది. కరోనా సమయంలో సెల్ ఫోన్ వినియోగం ఎంత అనే అంశంపై సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, పుణే నగరాల్లో నిర్వహించగా.. ఇందులో పాల్గొన్న యువత వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్ లైన్ క్లాసులతో పాటు ఎంటర్ టైన్ కోసం ఓటీటీ, యూట్యూబ్ చూసినట్లు చెప్పారు. తద్వారా 63 శాతం, నెట్ ఫ్లిక్స్ వంటి ఓటీటీలు చూడడం 59 శాతం పెరిగింది. 84 శాతం మందికి నిద్రలేచిన మొదటి 15 నిమిషాల్లోనే తమ ఫోన్‌ను చూడటం అలవాటు ఉన్నట్లు తేలింది. కాగా స్మార్ట్‌ఫోన్ వినియోగం వల్ల ఎన్నో పనులు కంప్లీ చేస్తున్నా..దాని వల్ల టైమ్ వేస్ట్ అవుతుందని బాధపడుతున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఫోన్ లేకుంటే అసహనం లేదా విచారం కలుగుతుందని 76 శాతం మంది చెప్పారు.
