బాలుడి డెడ్ బాడీకి రీపోస్టుమార్టం

సంగారెడ్డి (హత్నూర), వెలుగు:  సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కొన్యాల గ్రామంలో పాతిపెట్టిన బాలుడి డెడ్ బాడీకి శవ పరీక్షలు నిర్వహించారు. స్థానిక తహసీల్దార్ పోలీసుల సమక్షంలో గురువారం రీ పోస్టుమార్టం జరిగింది.  కొన్యాల గ్రామానికి చెందిన చిలిపిచెట్టి ప్రభులింగం, అనురాధ దంపతుల నెలన్నర కుమారుడు దశ్విక్ ను అనారోగ్యం కారణంగా సంగారెడ్డిలోని శిశురక్ష చిల్డ్రన్ హాస్పిటల్ లో ఈనెల 5న అడ్మిట్ చేశారు. కాగా చికిత్స పొందుతూ 8న మృతి చెందాడు.

ఆసుపత్రిలో కుమారుడు మృతి చెందడంపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. వైద్యులు సరైన చికిత్స అందించలేరని సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు గురువారం కొన్యాల గ్రామంలో తహసీల్దార్ ఫర్వీన్ షేక్, సంగారెడ్డి టౌన్ ఎస్సై నర్సింలు, మెడికల్ కాలేజ్ డాక్టర్, ప్రొఫెసర్లు దీపక్, వేణుగోపాల్ రావు సమక్షంలో శవ పరీక్షలు నిర్వహించారు. వైద్య నిపుణులు, పోలీసుల సమక్షంలో పూడ్చిపెట్టిన బాలుడి శవాన్ని వెలికి తీసి వైద్య బృందం పరీక్షలు నిర్వహించిందన్నారు. రిపోర్టు ఆధారంగా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నయాబ్ తహసీల్దార్ దావూద్ అహ్మద్, ఆర్ ఐ శ్రీనివాస్ రెవెన్యూ సిబ్బంది  ఉన్నారు.