ఈ-ట్రాక్టర్ వస్తోంది.. కిలో మీటర్‌కు రూ.14లే ఖర్చు, 3గంటలే ఛార్జింగ్

ఇప్పటి వరకు మీరు ఎలక్ట్రికల్ కారు చూసుంటారు, ఎలక్ట్రికల్ బైక్ చూసుంటారు.. కానీ ఎలక్ట్రికల్ ట్రాక్టర్ ఎప్పుడైనా చూశారా? ఈ-ట్రాక్టర్ వస్తే ఇండియా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయి. ఇండియా జనాభాలో దాదాపు 60 శాతం మంది వ్యవసాయం రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పుడిప్పుడే రైతులు టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నారు. అయితే వ్యవసాయంలో రైతన్నకు చేదోడు వాదోడుగా ఉండే ట్రాక్టర్ పై ప్రయోగాలు జరుగున్నాయి. 

ట్రాక్టర్ మెయిన్ టెనెన్స్ ఖర్చు తగ్గించే దిశగా ఎలక్ట్రానిక్ ట్రాక్టర్ తీసుకురావాలని కుబోటా, మహీండ్రా, HAV, సోనాలికా ట్రాక్టర్ కంపెనీలు ఎలక్ట్రానిక్ ట్రాక్టర్ నమోనా చూపించాయి. AutoNxt స్టార్టప్ కంపెనీ ఎలక్ట్రికల్ ట్రాక్టర్ టెక్నాలజీపై పని చేస్తోంది. AutoNxt కంపెనీ ఈ ట్రాక్టర్ కోసం లెవల్ 3 అటానమస్ టెక్నాలజీ వాడుతున్నట్లు సీఈఓ చెప్పారు. డ్రైవర్ లెస్ ట్రాక్టర్ టెక్నాలజీ కూడా ఈ కంపెనీలో వచ్చే ఏడాది లోపు వస్తుందని సీఈఓ  కౌస్తుభ్ ధోండే చెప్పారు. 

డీజిల్ ట్రాక్టర్ కంటే ఈ ట్రాక్టర్ తక్కువ మెయిన్ టెనెన్స్ ఉంటుందని ధోండే అన్నారు. డీజిల్ ట్రాక్టర్ కిలో మిటర్ కు  రూ.93లు ఖర్చు అయితే.. ఈ ట్రాక్టర్ రూ.14 లు మాత్రమే ఖర్చు వస్తుందని ఆయన తెలిపారు. డీజిల్ ట్రాక్టర్ల కంటే ఈ ట్రాక్టర్ల ఇంజన్ పవర్ కూడా అధికంగా ఉంటుందట. ట్రాక్టర్ ను కంపెనీ ఛార్జర్ తో మూడు గంటల్లో ఛార్జ్ చేయవచ్చని ధోండే అంటున్నారు. 2025 ఆర్థిక సంవర్సరానికి 100 ఈ ట్రాక్టర్లను మార్కెట్లోకి తీసుకురావాలని AutoNxt కంపెనీ ట్రై చేస్తోంది.