సికింద్రాబాద్, వెలుగు : సీతాఫల్ మండి చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆటో డ్రైవర్లు ప్లకార్ట్స్ ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆటోయూనియన్ నాయకులు శంకర్ యాదవ్, బల్ది వేణు, కొమురెల్లి బాబు, మధుకర్, మాట్లాడారు. ప్రభుత్వం ఎన్నికల హామీలో సంవత్సరానికి రూ,12000 ఇస్తామని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, ఆటో మీటర్ చార్జీలను పెంచుతామని హామీ ఇచ్చి అధికారంలోకొచ్చి సంవత్సరం అవుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు.
వీరికి సీపీఐ సికింద్రాబాద్ కార్యదర్శి కాంపల్లి శ్రీనివాస్ సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు నరసింహ, కాశీనాథ్, శ్రీనివాస్, రవి, బిక్షపతి, రమేశ్, వెంకటేశ్, లక్ష్మణ్, శరణాలు పాల్గొన్నారు.