కొండారెడ్డిపల్లి డెవలప్​మెంట్​పై ఫోకస్

  • సీఎం నివాసంలో అధికారులతో కలెక్టర్, ఎమ్మెల్యే రివ్యూ

వంగూర్, వెలుగు : నాగర్​కర్నూల్​ జిల్లా వంగూరు మండలంలోని సీఎం స్వగ్రామం కొండారెడ్డిపల్లి డెవలప్​మెంట్​పై అధికార యంత్రాంగం ఫోకస్​ పెట్టింది. కలెక్టర్​ బదావత్​ సంతోష్, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ శుక్రవారం సీఎం ఇంటిలో వివిధ శాఖల అధికారులతో అభివృద్ధి పనులపై రివ్యూ చేశారు. కొండారెడ్డిపల్లి గ్రామంలో వెటర్నరీ హాస్పిటల్, బీసీ కమ్యూనిటీ హాల్, లైబ్రరీ, జీపీ బిల్డింగ్​ ఆధునికీకరణ, ఎస్సీ కమ్యూనిటీ హాల్​ కంప్లీట్​ చేయడంతో పాటు మహిళా సంఘాల బిల్డింగ్​ రిపేర్లు,ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు

ఫుట్​పాత్, కొత్త బస్టాండ్  నిర్మాణం, చిల్డ్రన్స్  పార్క్  ఏర్పాటుపై రివ్యూ చేశారు. అలాగే రైతు వేదిక ఆధునికీకరణ, అండర్  గ్రౌండ్  డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణం, పాల శీతలీకరణ కేంద్రం, బీటీ రోడ్ల నిర్మాణం, వంగూరులో కార్యాలయ కాంప్లెక్స్  కొత్త బిల్డింగ్, 11 కేవీ విద్యుత్  వైర్లను మార్చడం, 100 కేవీ ట్రాన్స్​ఫార్మర్ల ఏర్పాటు, కెనాల్  రిపేర్లు, గోదామ్​ల నిర్మాణంతో పాటు అభివృద్ధి పనులపై ప్రపోజల్స్​పై అధికారులతో చర్చించారు.ఈ సందర్భంగా కలెక్టర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రాధాన్యతాక్రమంలో చేపట్టాలన్నారు.

మంజూరైన పనులకు టెండర్లు పూర్తి చేసి పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. రోడ్ల విస్తరణ, రిపేర్లపై పీఆర్, ఆర్అండ్ బీ ఆఫీసర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గృహజ్యోతి పథకం కింద పేద కుటుంబాలకు ఉచిత విద్యుత్, మిషన్ భగీరథ కింద ప్రతి ఇంటికి మంచినీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

నియోజకవర్గానికి మంజూరైన చెక్ డ్యాంలు, అటవీ శాఖ భూముల్లో జరుగుతున్న పనులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొండారెడ్డిపల్లిలో వెటర్నరీ హాస్పిటల్​ను ప్రారంభించారు. గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్, సీఎం సోదరుడు ఎనుముల కృష్ణారెడ్డి, జడ్పీటీసీ కేవీఎన్  రెడ్డి, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి జీవీ రమేశ్  పాల్గొన్నారు.