వందేళ్ల బ్రిడ్జిపై రాకపోకలు బంద్​

ఖమ్మం నగరంలో వందేళ్ల క్రితం నిజాం హయాంలో నిర్మించిన పాత వంతెనపై రాకపోకలను అధికారులు నిలిపివేశారు. గతేడాది సెప్టెంబర్ లో మున్నేరుకు భారీ వరదలు వచ్చిన తర్వాత ఆ వంతెన పై నుంచి లారీలు, బస్సుల లాంటి భారీ వాహనాలను బంద్ చేశారు. కేవలం కార్లు, లారీలు, ఆటోలు, టూవీలర్లను మాత్రమే అనుమతించారు.  ఇప్పుడు పాత బ్రిడ్జి పక్కనే కాజ్ వేను అభివృద్ధి చేసి, దాని పై నుంచి వాహనాలను నడిపిస్తున్నారు. అయితే పాత బ్రిడ్జికి మరో వైపు దాదాపు రూ.187 కోట్లతో మున్నేరుపై తీగల వంతెన పనులు జరుగుతున్నాయి.

ఆ బ్రిడ్జి పనులు పూర్తి కావడానికి మరో ఏడాది పడుతుందని అధికారులు చెబుతున్నారు. అప్పటి వరకు ఉపయోగించుకునేందుకు కాజ్ వేను డెవలప్ చేశారు. తీగల వంతెన పనులు పూర్తయ్యే లోపు మళ్లీ మున్నేరుకు వరదలు వస్తే పాత బ్రిడ్జిపై అనుమతించే అవకాశం ఉందని చెబుతున్నారు. వాహనాలను పునరుద్ధరించిన రోడ్డుపై మళ్లించడంతో సోమవారం సాయంత్రం వాహనాల రద్దీ పెరిగింది. దీంతో వాహనదారులు ఇటు నుంచి, అటువైపు వెళ్లేందుకు  ఇబ్బందులు పడ్డారు. వెలుగు ఫొటోగ్రాఫర్,  ఖమ్మం