ఓపెన్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్.. టైం టేబుల్ ఇదే!

తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి, ఇంటర్ దూరవిద్యకు దరఖాస్తు చేసుకున్న వారికి ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ చేశారు అధికారులు. అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్షల టైమ్ టేబుల్‌ను అందుబాటులో ఉంచారు. అక్టోబరు 2 నుంచి 9 వరకు టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం, మధ్యా్హ్నం రెండు పూటల పరీక్షలు నిర్వహించనున్నారు. 

ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు ఉంటాయి. అక్టోబరు 16 నుంచి 23 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూలును సబ్జెక్టులవారీగా తర్వాత విడుదల చేయనున్నారు.

హాల్‌టికెట్లను త్వరలోనే వెబ్‌సైట్‌లో అందుబాటులో పెడతామని అధికారులు తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి. హాల్‌టికెట్ లేనిదే పరీక్ష కేంద్రంలోనికి అనుమతించరు. టైంకు ఎగ్జామ్ సెంటర్ కు రావాలని విద్యార్థులకు సూచించారు.