ఆసీస్‌‌‌‌‌‌‌‌ క్లీన్‌‌‌‌‌‌‌‌ స్వీప్‌‌‌‌‌‌‌‌ మూడో టీ20లోనూ పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ ఓటమి

హోబర్ట్‌‌‌‌‌‌‌‌ (ఆస్ట్రేలియా): సొంతగడ్డపై పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ చేతిలో వన్డే సిరీస్ ఓటమికి ఆస్ట్రేలియా పరాజయం తీర్చుకుంది. ఆ జట్టుతో మూడు టీ20ల సిరీస్‌‌‌‌‌‌‌‌ను ఆసీస్‌‌‌‌‌‌‌‌ 3–0తో క్లీన్‌‌‌‌‌‌‌‌స్వీప్‌‌‌‌‌‌‌‌ చేసింది. మార్కస్ స్టోయినిస్ (27 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో  61 నాటౌట్‌‌‌‌‌‌‌‌) విజృంభించడంతో  సోమవారం జరిగిన చివరి, మూడో టీ20లో కంగారూ టీమ్‌‌‌‌‌‌‌‌ 7 వికెట్ల తేడాతో పాక్‌‌‌‌‌‌‌‌ను చిత్తు చేసింది. 

టాస్ నెగ్గి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన పాక్‌‌‌‌‌‌‌‌ 18.1 ఓవర్లలో 117 రన్స్‌‌‌‌‌‌‌‌కే ఆలౌటైంది. బాబర్ ఆజమ్ (41), హసీబుల్లా ఖాన్ (24) తప్ప మిగతా బ్యాటర్లు ఫెయిలయ్యారు. ఆసీస్ బౌలర్లలో ఆరోన్ హార్డీ మూడు  వికెట్లు పడగొట్టాడు. అనంతరం స్టోయినిస్ మెరుపులతో ఆసీస్‌‌‌‌‌‌‌‌ 11.2 ఓవర్లలోనే 118/3 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. స్టోయినిస్‌‌‌‌‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌, స్పెన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాన్సన్‌‌‌‌‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు లభించాయి.