ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెనికా సంస్థలు డిసెంబర్ 31 కల్లా కరోనా వ్యాక్సిన్ ను అందుబాటులో తెస్తున్నట్లు తెలుస్తోంది.
ఆగస్ట్ మొదటి వారం ఆస్ట్రేలియాలో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌ను మొత్తం జనాభాకు ఉచితంగా అందించేలా ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది
అయితే ఆ టీకాను ముస్లీంలు తీసుకోకూడదంటూ ఆస్ట్రేలియా కు ముస్లిం మతపెద్ద ఆదేశాలు జారీ చేశారు.
ముస్లిం మతపెద్ద సుఫ్యాన్ ఖలీఫా ఓ వీడియోను విడుదల చేశారు. వీడియోలో ప్రవక్తల మార్గాన్ని అనుసరించండి అంటూ ఆస్ట్రాజెనికా కరోనా వ్యాక్సిన్ ను తయారు చేసే పద్దతి గురించి చెప్పారు. 1970 లలో గర్భస్రావం చేయబడిన శిశువు యొక్క పిండ కణాలను ఉపయోగించి ఈ టీకాను తయారు చేశారని అన్నారు.
పలువురు ముస్లింల శరీరాలపైనా వ్యాక్సిన్ ను ప్రయోగించారని, ఇది సిగ్గు చేటని వ్యాఖ్యానించాడు. ఆ వ్యాక్సిన్ ను తయారు చేసిన ఆస్ట్రాజెనికాతో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడాన్ని సుఫ్యాన్ ఖలీఫా ప్రశ్నించారు.
