Women's T20 World Cup 2024: తేలిపోయిన లంక మహిళలు.. ఆస్ట్రేలియా బోణీ

షార్జా: చిన్న టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో బెత్‌‌ మూనీ (43 నాటౌట్‌‌) నిలకడగా ఆడటంతో.. విమెన్స్‌‌ టీ20 వరల్డ్‌‌కప్‌‌లో ఆస్ట్రేలియా బోణీ చేసింది. శనివారం జరిగిన తొలి మ్యాచ్‌‌లో 6 వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలిచింది. టాస్‌‌ గెలిచిన లంక 20 ఓవర్లలో 93/7 స్కోరు చేసింది. నీలాక్షిక సిల్వ (29 నాటౌట్‌‌) టాప్‌‌ స్కోరర్‌‌. హర్షిత (23) ఫర్వాలేదనిపించింది. మేఘన్‌‌ షుట్‌‌ 3, సోఫీ 2 వికెట్లు తీశారు.

తర్వాత ఆసీస్‌‌ 14.2 ఓవర్లలో 94/4 స్కోరు చేసి నెగ్గింది. అలీసా హీలీ (4), జార్జియా వారెహామ్‌‌ (3) వెంటవెంటనే ఔటైనా, మూనీ.. ఎలీసా పెరీ (17)తో కలిసి మూడో వికెట్‌‌కు 21 రన్స్‌‌ జోడించింది. మధ్యలో ఆష్లే గాడ్నెర్‌‌ (12) కూడా మూనీకి అండగా నిలిచింది. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌‌కు 43 రన్స్‌‌ జత చేసి విజయానికి బాటలు వేశారు.  షుట్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది.