అట్టర్​ ఫ్లాప్‌‌‌‌.. ఐదో టెస్టులోనూ టీమిండియా ఓటమి

  • 6 వికెట్లతో గెలిచిన ఆస్ట్రేలియా
  • 3–1తో సిరీస్‌‌‌‌ సొంతం 
  • 10 ఏండ్ల తర్వాత బోర్డర్‌‌‌‌–గావస్కర్‌‌‌‌ ట్రోఫీ నెగ్గిన ఆసీస్‌‌‌‌
  • డబ్ల్యూటీసీ ఫైనల్కు అర్హత

సిడ్నీ: ఆస్ట్రేలియా గడ్డపై మరోసారి అట్టర్‌‌‌‌‌‌‌‌ ఫ్లాఫ్‌‌‌‌‌‌‌‌ అయిన ఇండియా 10 ఏండ్ల తర్వాత బోర్డర్–గావస్కర్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీని చేజార్చుకుంది. వివాదాలు, విమర్శల మధ్య మొదలై మూడ్రోజుల్లోనే ముగిసిన ఐదో టెస్టులో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో ఐదు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌ను ఆసీస్‌‌‌‌‌‌‌‌ 3–1తో సొంతం చేసుకుంది. దశాబ్ద విరామం తర్వాత బోర్డర్‌‌‌‌‌‌‌‌–గావస్కర్ ట్రోఫీని తిరిగి సొంతం చేసుకుంది. దాంతో పాటు ఇండియాను ఎలిమినేట్ చేసి వరల్డ్‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్​కు రెండోసారి అర్హత సాధించింది. ఆదివారం ఇండియా నిర్దేశించిన 162 పరుగుల చిన్న టార్గెట్‌‌‌‌‌‌‌‌ను ఆసీస్‌‌‌‌‌‌‌‌ 27 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

ఉస్మాన్‌‌‌‌‌‌‌‌ ఖవాజ (41), ట్రావిస్‌‌‌‌‌‌‌‌ హెడ్‌‌‌‌‌‌‌‌ (34 నాటౌట్‌‌‌‌‌‌‌‌), బ్యూ వెబ్‌‌‌‌‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌ (39 నాటౌట్‌‌‌‌‌‌‌‌) మెరుగ్గా ఆడారు. అంతకుముందు 141/6 ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌ స్కోరుతో ఆట కొనసాగించిన ఇండియా రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 39.5 ఓవర్లలో 157 రన్స్‌‌‌‌‌‌‌‌కే కుప్పకూలింది. బోలాండ్‌‌‌‌‌‌‌‌ (6/45)కు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌’ దక్కగా, ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌లో 32 వికెట్లు తీసిన జస్‌‌‌‌‌‌‌‌ప్రీత్‌‌‌‌‌‌‌‌ బుమ్రాకు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద సిరీస్‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది. 2014/15లో ఆసీస్‌‌‌‌‌‌‌‌ చివరిసారి బోర్డర్‌‌‌‌‌‌‌‌–గావస్కర్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీని గెలిచింది. ఇక వరుసగా రెండుసార్లు డబ్ల్యూటీసీ ఫైనల్స్‌‌‌‌‌‌‌‌కు అర్హత సాధించిన ఇండియా మూడోసారి ఫెయిలైంది.  

ఇంకో 47 బాల్స్‌‌‌‌లోనే..

రెండో రోజు రిషబ్ పంత్ ధనాధన్ బ్యాటింగ్‌‌‌‌తో జట్టును రేసులోకి తెచ్చినా..  మూడో రోజు లోయర్ ఆర్డర్ బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు. చేతిలో ఉన్న నాలుగు వికెట్లను వెంటవెంటనే చేజార్చుకొని ఆసీస్‌‌‌‌‌‌‌‌ ముందు కాపాడుకునే టార్గెట్‌‌‌‌‌‌‌‌ను ఉంచలేకపోయారు. దీనికి తోడు బోలాండ్‌‌‌‌‌‌‌‌, కమిన్స్‌‌‌‌‌‌‌‌ (3/44) రెండు వైపుల నుంచి పదునైన పేస్‌‌‌‌‌‌‌‌, స్వింగ్‌‌‌‌‌‌‌‌తో బెంబేలెత్తించారు. దీంతో మూడో రోజు 47 బాల్స్‌‌‌‌‌‌‌‌లోనే ఇండియా రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌కు తెరపడింది. ఆట మొదలైన మూడు, ఏడో ఓవర్లలో కమిన్స్‌‌‌‌‌‌‌‌ వరుసగా జడేజా (13), వాషింగ్టన్‌‌‌‌‌‌‌‌ సుందర్‌‌‌‌‌‌‌‌ (12)ను ఔట్‌‌‌‌‌‌‌‌ చేశాడు. 39వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో బోలాండ్‌‌‌‌‌‌‌‌ మూడు బాల్స్‌‌‌‌‌‌‌‌ తేడాలో సిరాజ్‌‌‌‌‌‌‌‌ (4), బుమ్రా (0)ను పెవిలియన్‌‌‌‌‌‌‌‌కు పంపాడు. ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా 74 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో  చివరి తొమ్మిది మంది బ్యాటర్లు ఔట్‌‌‌‌‌‌‌‌ కావడంతో ఇండియా చిన్న స్కోరుకే ఆలౌటైంది. 

బుమ్రా దిగలే.. 

వెన్ను నొప్పితోనే బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన పేస్ లీడర్‌‌‌‌‌‌‌‌ బుమ్రా.. బౌలింగ్‌‌‌‌‌‌‌‌కు రాకపోవడం ఇండియాకు అతిపెద్ద మైనస్‌‌‌‌‌‌‌‌గా మారింది. చిన్న టార్గెట్‌‌‌‌‌‌‌‌ను కాపాడటంలో మిగతా బౌలర్లు ఫెయిలయ్యారు. దీన్ని ఆసరాగా చేసుకున్న ఆసీస్‌‌‌‌ ఓపెనర్లు కాన్‌‌‌‌‌‌‌‌స్టస్‌‌‌‌‌‌‌‌ (22), ఖవాజ నాలుగు ఓవర్లలోనే 39 రన్స్‌‌‌‌‌‌‌‌ జత చేశారు. అయితే బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో కాస్త వేరియేషన్స్‌‌‌‌‌‌‌‌ రాబట్టిన ప్రసిధ్‌‌‌‌‌‌‌‌ కృష్ణ (3/65) వరుస విరామాల్లో లబుషేన్‌‌‌‌‌‌‌‌ (6), స్మిత్‌‌‌‌‌‌‌‌ (4)ను ఔట్‌‌‌‌‌‌‌‌ చేసి ఆశలు రేకెత్తించాడు. కానీ ఈ దశలో ఖవాజ, ట్రావిస్‌‌‌‌‌‌‌‌ హెడ్‌‌‌‌‌‌‌‌ నిలకడగా ఆడారు. నాలుగో వికెట్‌‌‌‌‌‌‌‌కు 46 రన్స్‌‌‌‌‌‌‌‌ జత చేసిన ఖవాజను సిరాజ్‌‌‌‌‌‌‌‌ (1/69) ఔట్‌‌‌‌‌‌‌‌ చేసినా వెబ్‌‌‌‌‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌, హెడ్‌‌   ఐదో వికెట్‌‌‌‌‌‌‌‌కు 58 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించి ఈజీగా గెలిపించారు. 

శరీరాన్ని కూడా గౌరవించాలి

మ్యాచ్‌‌‌‌ ఓడటం నిరాశపర్చింది. ఈ సిరీస్‌‌‌‌లో ఇంత మంచి వికెట్‌‌‌‌పై బౌలింగ్‌‌‌‌ చేయనందుకు కొంత బాధగా ఉంది. కానీ కొన్నిసార్లు మన శరీరాన్ని కూడా గౌరవించాల్సి ఉంటుంది. దానితో పోరాడలేం. మూడో రోజు ఉదయం సాధారణంగానే మొదలుపెట్టాలనుకున్నాం. మనపై నమ్మకం పెట్టుకుని సత్తా ఏంటో చూపాలని భావించాం. కానీ పరిస్థితులు మాకు అనుకూలించలేదు. ఈ సిరీస్‌‌‌‌లో మేం బాగా పోరాడమనే అనుకుంటున్నాం. ఈ అనుభవం మాకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. కుర్రాళ్లకు మంచి అనుభవం వచ్చింది. వాళ్ల బలమేంటో కూడా తెలిసింది. దానికి అనుగుణంగా ముందుకు సాగుతారని అనుకుంటున్నాం. సిరీస్‌‌‌‌ గెలవలేదనే నిరాశ వారిలో ఉంది. కానీ ఈ అనుభవం నుంచి వాళ్లు కూడా చాలా నేర్చుకుంటారు. మొత్తంగా ఇది గొప్ప సిరీస్‌‌‌‌. అద్భుతంగా సాగింది. ట్రోఫీ నెగ్గిన ఆసీస్‌‌‌‌కు అభినందనలు. –బుమ్రా

ట్రోఫీ ఇచ్చేందుకు పిలవలేదని గావస్కర్ అసంతృప్తి

బోర్డర్‌‌‌‌–గావస్కర్ ట్రోఫీ ప్రజెంటేషన్‌‌ సెర్మనీకి తనను పిలవకపోవడంపై ఇండియా లెజెండ్‌‌ సునీల్ గావస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. గావస్కర్, ఆస్ట్రేలియా గ్రేట్‌‌ అలెన్ బోర్డర్ పేరు మీద 1996–97 నుంచి ఇరు జట్ల మధ్య ఈ సిరీస్‌‌ నిర్వహిస్తున్నారు. ప్రస్తుత సిరీస్‌‌ను ఆసీస్ 3–1తో గెలిచింది. కానీ, ట్రోఫీ ప్రజెంటేషన్ సెర్మనీకి బోర్డర్‌‌‌‌ను మాత్రమే ఆహ్వానించారు. ఆ టైమ్‌‌లో గ్రౌండ్‌‌లోనే ఉన్న సన్నీని విస్మరించారు. ‘నేను కూడా ట్రోఫీ ప్రజెంటేషన్ సెర్మనీలో ఉంటే సంతోషించేవాడిని. ఎందుకంటే ఇది బోర్డర్‌‌‌‌–గావస్కర్ ట్రోఫీ.. ఇండియా–ఆస్ట్రేలియాకు సంబంధించినది. పైగా, నేను ఈ గ్రౌండ్‌‌లోనే ఉన్నా. ఆస్ట్రేలియా గెలిచినందుకు నాకు ఎలాంటి పట్టింపు లేదు. వాళ్లు మెరుగైన క్రికెట్ ఆడారు కాబట్టే గెలిచారు. నేను ఇండియన్‌‌ను  కాబట్టి నా ఫ్రెండ్ అలెన్ బోర్డర్‌‌తో కలిసి వారికి ట్రోఫీని అందజేస్తే ఆనందంగా ఉండేది’ అని సన్నీ పేర్కొన్నాడు.

సంక్షిప్త స్కోర్లు

ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌: 185 ఆలౌట్‌‌‌‌. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌: 181 ఆలౌట్‌‌‌‌. ఇండియా రెండో ఇన్నింగ్స్‌‌‌‌: 39.5 ఓవర్లలో 157 ఆలౌట్‌‌‌‌ (పంత్‌‌‌‌ 61, బోలాండ్‌‌‌‌ 6/45, కమిన్స్‌‌‌‌ 3/44). ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌‌‌‌ (టార్గెట్‌‌ 162): 27 ఓవర్లలో 162/4 (ఖవాజ 41, వెబ్‌‌‌‌స్టర్‌‌‌‌ 39నాటౌట్‌‌, ప్రసిధ్‌‌‌‌ 3/65).

1. ఇండియా తరఫున ఒక టెస్టు సిరీస్‌‌‌‌లో అత్యధిక వికెట్లు తీసిన  ఫాస్ట్ బౌలర్‌‌‌‌గా బుమ్రా (32 వికెట్లు) లెజెండరీ బౌలర్ కపిల్ దేవ్ సరసన నిలిచాడు. 1978–79లో కపిల్‌‌‌‌ పాకిస్తాన్‌‌తో సిరీస్‌‌లో 32 వికెట్లు పడగొట్టాడు. 

2. 2024-25 సీజన్‌‌‌‌లో ఇండియా ఒకే సిరీస్‌‌‌‌లో మూడు టెస్టులు ఓడటం ఇది రెండోసారి. న్యూజిలాండ్‌‌‌‌తో సిరీస్‌‌లో మూడు మ్యాచ్‌‌ల్లోనూ ఓడింది.

3. 2000 నుంచి జరిగిన సిరీస్‌‌‌‌ల్లో రెండు టెస్టులో రెండు ఇన్నింగ్స్‌‌‌‌ల్లోనూ 200, అంతకంటే తక్కువ రన్స్‌‌‌‌కు ఆలౌట్‌‌‌‌ కావడం ఇండియాకు ఇది మూడోసారి. అడిలైడ్‌‌‌‌ టెస్టులో 180, 175.. సిడ్నీలో 185, 175 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. గతంలో ఇంగ్లండ్‌‌‌‌ (2014), న్యూజిలాండ్‌‌‌‌ (2002-03) చేతిలోనూ ఇలానే ఆలౌట్‌‌ అయింది.

100: మహ్మద్ సిరాజ్ టెస్టుల్లో వంద వికెట్ల క్లబ్‌‌లో చేరాడు. 36 టెస్టుల్లో అతను ఈ ఘనత సాధించాడు. 1141, 1896 తర్వాత సిడ్నీలో అతి తక్కువ బాల్స్‌‌‌‌లో ముగిసిన టెస్ట్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ ఇదే. అంతకుముందు 1887-88, 1894-95లో ఇంగ్లండ్‌‌‌‌తో టెస్టులు  వరుసగా 1129, 911 బంతుల్లో ముగిశాయి.