IND vs AUS: తొలి రోజే 17 వికెట్లు.. ఆసీస్‌ను డేంజర్ జోన్‌లోకి నెట్టిన భారత్

పెర్త్ టెస్టులో భారత్ తడబడి తేరుకుంది. బ్యాటింగ్ లో విఫలమైనా బౌలింగ్ లో అద్భుతంగా రాణించి తొలి రోజు పై చేయి సాధించింది.    ఫలితంగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ ను డేంజర్ జోన్ లోకి నెట్టింది. బుమ్రా నిప్పులు చేరగడంతో పాటు సిరాజ్,హర్షిత్   రానా రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి  తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 83 పరుగులు వెనకబడి ఉంది. క్రీజ్ లో క్యారీ (19), స్టార్క్ (6) ఉన్నారు. 

భారత్ ను 150 పరుగులకే ఆలౌట్ చేసి బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్ బుమ్రా ధాటికి విల విల్లాడింది. స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు తీసి కంగారూలకు ఊహించని షాక్ ఇచ్చాడు. ఓపెనర్ నాథన్ మెక్‌స్వీనీ చేసి ఔట్ కాగా.. ఖవాజా 8 పరుగులకే పెవిలియన్ చేరాడు. స్మిత్ ను గోల్డెన్ డక్ చేసిన బుమ్రా ఆసీస్ ను కష్టాల్లో పడేశాడు. హర్షిత్ రానా, సిరాజ్ కూడా చెలరేగడంతో హెడ్(11), మార్ష్ (6),  లబు షేన్ (2),  కమ్మిన్స్ (3) త్వరగానే పెవిలియన్ కు చేరారు. దీంతో ఆసీస్ 67 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. 

ALSO READ : IND vs AUS: చెలరేగుతున్న బుమ్రా.. ఆసీస్ టాపార్డర్ కకావికలం

అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్ లో తీవ్రంగా నిరాశపరిచింది. రిషబ్ పంత్(37) , తెలుగు కుర్రాడు నితీష్  కుమార్ రెడ్డి(41) మినహాయిస్తే మిగిలిన వారందరూ ఘోరంగా విఫలమయ్యారు. ఆస్ట్రేలియా పేస్ బౌలింగ్ ధాటికి తలవంచుతూ కేవలం 150 పరుగులకే ఆలౌటయ్యారు. జైశ్వాల్ (0), పడికల్ (0), కోహ్లీ (5) విఫలమయ్యారు. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి 41 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.