బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ తో జరగబోయే చివరి రెండు టెస్టులకు ఆస్ట్రేలియా జట్టును ప్రకటించారు. శుక్రవారం (డిసెంబర్ 20) క్రికెట్ ఆస్ట్రేలియా 14 మందితో కూడిన సభ్యులను ప్రకటించింది. నాలుగు, ఐదు టెస్టుల కోసం ఆస్ట్రేలియా స్క్వాడ్ లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. డేవిడ్ వార్నర్‌కు ప్రత్యామ్నాయంగా తొలి మూడు టెస్టులు ఆడిన ఓపెనింగ్ బ్యాటర్ నాథన్ మెక్‌స్వీనీని స్క్వాడ్ నుంచి తప్పించారు. అతని స్థానంలో 19 ఏళ్ల సామ్ కాన్స్టాస్ కు చోటు దక్కింది.
Also Read:-హైబ్రిడ్ మోడల్‌లోనే చాంపియన్స్ ట్రోఫీ..
పింక్-బాల్ టెస్ట్‌కు ముందు కాన్‌బెర్రాలో టీమ్ ఇండియాతో జరిగిన ప్రైమ్ మినిస్టర్స్ XI ప్రాక్టీస్ గేమ్‌లో సామ్ కాన్స్టాస్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో ఈ యువ బ్యాటర్ నాలుగో టెస్టుకు ఓపెనర్ గా బరిలోకి దిగడం దాదాపుగా ఖాయమైంది. పాట్ కమ్మిన్స్ జట్టును నడిపించగా.. స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ లను వైస్ కెప్టెన్ లుగా ప్రకటించారు. బ్రిస్బేన్ టెస్ట్‌లో గాయపడ్డ ఫాస్ట్ బౌలర్ హాజిల్‌వుడ్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. సీరీస్‌లోని చివరి రెండు మ్యాచ్‌ల కోసం సీన్ అబాట్ , ఝై రిచర్డ్‌సన్, బ్యూ వెబ్‌స్టర్‌లను స్క్వాడ్ లో చేర్చారు.
భారత్‌తో జరిగే చివరి రెండు టెస్టులకు ఆస్ట్రేలియా జట్టు:
పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుస్‌చాగ్నే , సామ్ కొన్‌స్టాస్, ఉస్మాన్ ఖవాజా , ట్రావిస్ హెడ్ , మిచెల్ మార్ష్ , బ్యూ వెబ్‌స్టర్, సీన్ అబాట్, మిచెల్ స్టార్క్ , నాథన్ లియోన్ , ఝీ ఎ రిచర్డ్‌సన్ , స్కాట్ బోలాండ్, మరియు జోష్ ఇంగ్లీష్ .
? Australia name squad for the MCG and SCG Test vs India #BGT2024
— Cricbuzz (@cricbuzz) December 20, 2024
✅ Sean Abbott returns along with Beau Webster
✅ Jhye Richardson added
✅ Sam Konstas earns maiden Test call-up
❎ Nathan McSweeney misses out pic.twitter.com/tclf7auPM8