IND vs AUS: రెండు వికెట్లు తీస్తే ముగిసినట్టే.. పెర్త్ టెస్టులో విజయానికి చేరువలో భారత్

పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్ విజయానికి చేరువలో ఉంది. 534 పరుగుల లక్ష్య ఛేదనలో నాలుగో రోజు టీ విరామ సమయానికి 8 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. క్రీజ్ లో అలెక్స్ క్యారీ (30), లియాన్ (0) ఉన్నారు. భారత్ గెలవాలంటే మరో మూడు వికెట్లు తీస్తే సరిపోతుంది. మరోవైపు ఆసీస్ విజయానికి 307 పరుగులు కావాలి. దీంతో ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. 

5 వికెట్ల నష్టానికి 104 పరుగులతో నాలుగో రోజు లంచ్ తర్వాత బ్యాటింగ్ కొనసాగించిన ఆస్ట్రేలియా భారత బౌలర్లపై ఎటాకింగ్ కు దిగారు. మార్ష్, హెడ్ వేగంగా ఆడుతూ స్కోర్ కార్డు ను ముందుకు తీసుకెళ్లారు. ముఖ్యంగా మార్ష్ బౌండరీలతో చెలరేగాడు. హెడ్ కూడా వేగంగా ఆడడంతో ఆసీస్ కు వేగంగా పరుగులు వచ్చాయి. అయితే బుమ్రా బౌలింగ్ కు దిగి హెడ్ (89) ను ఔట్ చేయడంతో అతని అద్భుతమైన ఇన్నింగ్స్ కు తెర పడింది. ఆ తర్వాత తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి మార్ష్ ను బౌల్డ్ చేశాడు.

ALSO READ : IND vs AUS: రెండు వికెట్లు తీస్తే ముగిసినట్టే.. పెర్త్ టెస్టులో విజయానికి చేరువలో భారత్

టీ విరామానికి ముందు సుందర్ స్టార్క్ వికెట్ తీయడంతో ఆసీస్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. అంతకముందు తొలి ఇన్నింగ్స్ లో భారత్ 150 పరుగులు చేస్తే.. ఆస్ట్రేలియా 104 పరుగులకు ఆలౌట్ అయింది.  రెండో ఇన్నింగ్స్ లో భారత్ 6 వికెట్ల నష్టానికి 487 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది.