IND vs AUS: నిప్పులు చెరిగిన ఆసీస్ పేసర్లు.. 150 పరుగులకే కుప్పకూలిన భారత్

పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాపై జరుగుతున్న తొలి టెస్టు మొదట ఇన్నింగ్స్ లో భారత్ బ్యాటింగ్ లో తీవ్రంగా నిరాశపరిచింది. రిషబ్ పంత్(37) , తెలుగు కుర్రాడు నితీష్  కుమార్ రెడ్డి(41) మినహాయిస్తే మిగిలిన వారందరూ ఘోరంగా విఫలమయ్యారు. ఆస్ట్రేలియా పేస్ బౌలింగ్ ధాటికి తలవంచుతూ కేవలం 150 పరుగులకే ఆలౌటయ్యారు. 41 పరుగులు చేసిన నితీష్ కుమార్ టాప్ స్కోరర్. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆస్ట్రేలియా బౌలర్లలో హాజిల్‌వుడ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. స్టార్క్, మిచెల్ మార్ష్, కమ్మిన్స్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.  

నాలుగు వికెట్ల నష్టానికి 51 పరుగులతో రెండో సెషన్ ప్రారంభించిన భారత్ కు వరుస ఎదురు దెబ్బలు తగిలాయి. 11 పరుగులు చేసిన జురెల్, 4 పరుగులు చేసిన సుందర్ వెంటనే ఔటయ్యారు.ఈ దశలో టీమిండియాను ఆదుకునే బాధ్యత పంత్, నితీష్ తీసుకున్నారు. వీరిద్దరూ ఆస్ట్రేలియా బౌలర్లను సమర్ధవంతంగా అడ్డుకున్నారు. ఏడో వికెట్ కు 49 పరుగులు జోడించి స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. ఈ దశలో కమ్మిన్స్ బౌలింగ్ లో పంత్ (37) స్లిప్ లో దొరికిపోయాడు. 

Also Read:-ఒకే ఓవర్లో 34 పరుగులు..

ఆ తర్వాత హర్షిత్ రానా, బుమ్రా, నితీష్ వెంటనే ఔటయ్యారు. అంతకముందు తొలి సెషన్ లో 26 పరుగులు చేసి రాహుల్ పర్వాలేదనిపించాడు. జైశ్వాల్ (0), పడికల్ (0), కోహ్లీ (5) విఫలమయ్యారు. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి 41 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలవడం విశేషం.