సిడ్నీ: ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న ఆస్ట్రేలియా.. పాకిస్తాన్‌తో శనివారం జరిగిన రెండో టీ20లో 13 రన్స్ తేడాతో గెలిచింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరోటి మిగిలి ఉండగానే 2–0తో సొంతం చేసుకుంది.
టాస్ నెగ్గిన ఆసీస్ 20 ఓవర్లలో 147/9 స్కోరు చేసింది. మాథ్యూ షార్ట్ (32), ఆరోన్ హ్యార్డీ (28), మ్యాక్స్‌వెల్ (21), మెక్‌గుర్క్ (20) రాణించారు. హారిస్ రవూఫ్ 4, అబ్బాస్ ఆఫ్రిది 3, సుఫియాన్ ముకీమ్ 2 వికెట్లు తీశారు. ఛేజింగ్‌లో పాకిస్తాన్ 19.4 ఓవర్లలో 134 రన్స్‌కే ఆలౌటైంది. ఉస్మాన్ ఖాన్ (52), ఇర్ఫాన్ ఖాన్ (37 నాటౌట్) మినహా మిగతా వారు ఫెయిలయ్యారు. ఇన్నింగ్స్ మొత్తంలో ఎనిమిది మంది సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. స్పెన్సర్ జాన్సన్ 5, ఆడమ్ జంపా 2 వికెట్లు పడగొట్టారు. జాన్సన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య ఆఖరిదైన మూడో టీ20 హోబర్ట్‌లో సోమవారం జరుగుతుంది.
Irfan Khan sent a few jitters, but Nathan Ellis stayed cool for an anticlimactic end ??
— ESPNcricinfo (@ESPNcricinfo) November 16, 2024
Scorecard: https://t.co/LA5xJrxsV2 | #AUSvPAK pic.twitter.com/UXtJ5JEZGX