బుమ్రా ఆరేసినా.. హెడ్‌‌‌‌‌‌‌‌, స్మిత్‌‌‌‌‌‌‌‌ దంచిన్రు

బ్రిస్బేన్‌‌‌‌‌‌‌‌: ఇండియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌‌‌‌‌‌‌‌లో ఆస్ట్రేలియా ఆధిపత్యమే కొనసాగుతోంది. స్టార్‌‌‌‌‌‌‌‌ పేసర్‌‌‌‌‌‌‌‌ జస్ప్రీత్‌‌‌‌‌‌‌‌ బుమ్రా (6/76) ఆరు వికెట్లతో కట్టడి చేసినా.. ట్రావిస్‌‌‌‌‌‌‌‌ హెడ్‌‌‌‌‌‌‌‌ (160 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 18 ఫోర్లతో 152), స్టీవ్‌‌‌‌‌‌‌‌ స్మిత్‌‌‌‌‌‌‌‌ (190 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 12 ఫోర్లతో 101) అద్భుతంగా ఆడి సెంచరీలు చేయడంతో.. ఆదివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్‌‌‌‌‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 101 ఓవర్లలో 405/7 స్కోరు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. అలెక్స్‌‌‌‌‌‌‌‌ క్యారీ (45 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌), మిచెల్‌‌‌‌‌‌‌‌ స్టార్క్‌‌‌‌‌‌‌‌ (7 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌) క్రీజులో ఉన్నారు. చివరి మూడు రోజులు మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు వాన ముప్పు ఉండటంతో ఫలితం ఎలా రాబోతుందనే ఉత్కంఠ మొదలైంది.  

75 రన్స్‌‌‌‌‌‌‌‌కే 3 వికెట్లు..

ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌ స్కోరు 28/0తో రెండో రోజు ఆట కొనసాగించిన ఆస్ట్రేలియాను తొలి సెషన్‌‌‌‌‌‌‌‌ బుమ్రా వణికించాడు. బౌన్స్‌‌‌‌‌‌‌‌, స్వింగ్‌‌‌‌‌‌‌‌తో పాటు ఆఫ్‌‌‌‌‌‌‌‌ కట్టర్స్‌‌‌‌‌‌‌‌తో భయపెట్టాడు. ఈ క్రమంలో డే నాలుగో ఓవర్‌‌‌‌‌‌‌‌లోనే ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్‌‌‌‌‌‌‌‌ ఉస్మాన్‌‌‌‌‌‌‌‌ ఖవాజా (21)ను ఔట్‌‌‌‌‌‌‌‌ చేశాడు. ఫుల్‌‌‌‌‌‌‌‌ లెంగ్త్‌‌‌‌‌‌‌‌ యాంగిల్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌.. ఖవాజా బ్యాట్‌‌‌‌‌‌‌‌ ఎడ్జ్‌‌‌‌‌‌‌‌ను తాకుతూ కీపర్‌‌‌‌‌‌‌‌ చేతుల్లోకి వెళ్లింది. ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌లో ఖవాజా వికెట్‌‌‌‌‌‌‌‌ తీయడం బుమ్రాకు ఇది మూడోసారి. తన తర్వాతి ఓవర్‌‌‌‌‌‌‌‌లో ఔట్‌‌‌‌‌‌‌‌సైడ్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ స్టంప్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌తో నేథన్‌‌‌‌‌‌‌‌ మెక్‌‌‌‌‌‌‌‌స్వీని (9)ని దెబ్బకొట్టాడు. మూడు టెస్ట్‌‌‌‌‌‌‌‌ల్లో మెక్‌‌‌‌‌‌‌‌స్వీని ఔట్‌‌‌‌‌‌‌‌ చేయడం ఇది నాలుగోసారి. తర్వాత లబుషేన్‌‌‌‌‌‌‌‌ (12), స్మిత్‌‌‌‌‌‌‌‌పై సిరాజ్‌‌‌‌‌‌‌‌ (1/97), ఆకాశ్‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌ కూడా ఇదే ఒత్తిడిని కొనసాగించారు. 

ఓ ఎండ్‌‌‌‌‌‌‌‌లో స్మిత్‌‌‌‌‌‌‌‌ బ్యాట్‌‌‌‌‌‌‌‌ ఝుళిపించినా లబుషేన్‌‌‌‌‌‌‌‌ మాత్రం డిఫెన్స్‌‌‌‌‌‌‌‌కే ప్రాధాన్యమిచ్చాడు. కానీ ఇది వర్కౌట్‌‌‌‌‌‌‌‌ కాలేదు. ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ 34వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో నితీశ్‌‌‌‌‌‌‌‌ (1/65) లేట్‌‌‌‌‌‌‌‌ స్వింగ్‌‌‌‌‌‌‌‌తో లబుషేన్‌‌‌‌‌‌‌‌ను పెవిలియన్‌‌‌‌‌‌‌‌కు పంపాడు. ఫలితంగా ఆసీస్‌‌‌‌‌‌‌‌ 75/3తో కష్టాల్లో పడింది. రెండు ఓవర్ల తర్వాత ఎడమ కాలి ఇబ్బందితో ఓవర్‌‌‌‌‌‌‌‌ మధ్యలోనే సిరాజ్‌‌‌‌‌‌‌‌ బయటకు వెళ్లిపోయాడు. మెకాలిని చేతుల్లో పట్టుకుని డగౌట్‌‌‌‌‌‌‌‌లో కూర్చుండిపోయాడు. దీంతో ఒక్కసారి ఇండియన్‌‌‌‌‌‌‌‌ శిబిరంలో ఆందోళన నెలకొంది. అయితే కొద్దిసేపటి తర్వాత తిరిగి గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లోకి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో తప్పిదాలు..

లంచ్‌‌‌‌‌‌‌‌కు ముందే క్రీజులోకి వచ్చి కుదురుకున్న హెడ్‌‌‌‌‌‌‌‌కు ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌ పెట్టడంతో రోహిత్‌‌‌‌‌‌‌‌ విఫలమయ్యాడు. సింగిల్స్‌‌‌‌‌‌‌‌, డబుల్స్‌‌‌‌‌‌‌‌తో అతను చకచకా రన్స్‌‌‌‌‌‌‌‌ తీస్తూంటే హిట్‌‌‌‌‌‌‌‌మ్యాన్‌‌‌‌‌‌‌‌ పాయింట్‌‌‌‌‌‌‌‌, డీప్‌‌‌‌‌‌‌‌ స్క్వేర్‌‌‌‌‌‌‌‌ లెగ్‌‌‌‌‌‌‌‌లో ఫీల్డర్లను పెట్టడం తప్పిదంగా మారింది. ముఖ్యంగా సిరాజ్‌‌‌‌‌‌‌‌, ఆకాశ్‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో కట్స్‌‌‌‌‌‌‌‌, లెగ్‌‌‌‌‌‌‌‌సైడ్‌‌‌‌‌‌‌‌లో వేగంగా బౌండ్రీలు రాబట్టాడు. ఈ క్రమంలో షార్ట్‌‌‌‌‌‌‌‌ బాల్స్‌‌‌‌‌‌‌‌ వేసినా రోప్‌‌‌‌‌‌‌‌ దాటించాడు. ఈ టైమ్‌‌‌‌‌‌‌‌లో కూడా రోహిత్‌‌‌‌‌‌‌‌ థర్డ్‌‌‌‌‌‌‌‌ మ్యాన్‌‌‌‌‌‌‌‌లో ఫీల్డర్‌‌‌‌‌‌‌‌ను ఉంచలేదు. 

రన్స్‌‌‌‌‌‌‌‌ను కట్టడి చేసేందుకు స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ రవీంద్ర జడేజాను దించగా, అతను 16 ఓవర్లలో 76 రన్స్‌‌‌‌‌‌‌‌ ఇచ్చుకున్నాడు. రెండో ఎండ్‌‌‌‌‌‌‌‌లో స్మిత్‌‌‌‌‌‌‌‌ ఫస్ట్‌‌‌‌‌‌‌‌ హాఫ్‌‌‌‌‌‌‌‌ మొత్తం గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ నలువైపులా బాల్‌‌‌‌‌‌‌‌ను పంపిస్తూ సింగిల్స్‌‌‌‌‌‌‌‌, డబుల్స్‌‌‌‌‌‌‌‌ తీశాడు. రెండో హాఫ్‌‌‌‌‌‌‌‌లో స్టాన్స్‌‌‌‌‌‌‌‌ మార్చి అక్రాస్‌‌‌‌‌‌‌‌ ద స్టంప్స్‌‌‌‌‌‌‌‌తో బలమైన షాట్స్‌‌‌‌‌‌‌‌ కొట్టాడు. అయినా ఆకాశ్‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో పదేపదే ఔట్‌‌‌‌‌‌‌‌సైడ్‌‌‌‌‌‌‌‌ ఎడ్జ్‌‌‌‌‌‌‌‌ తీసుకున్నా వికెట్‌‌‌‌‌‌‌‌ మాత్రం ఇవ్వలేదు. ఈ క్రమంలో హెడ్‌‌‌‌‌‌‌‌ 115, స్మిత్‌‌‌‌‌‌‌‌ 185 బాల్స్‌‌‌‌‌‌‌‌లో సెంచరీలు పూర్తి చేశారు. 

ఇక కొత్త బాల్‌‌‌‌‌‌‌‌ తీసుకున్న తర్వాత కూడా వీళ్లు వెనక్కి తగ్గలేదు. ముఖ్యంగా హెడ్‌‌‌‌‌‌‌‌ టీ20 తరహా షాట్లతో రెచ్చిపోయాడు. నాలుగో వికెట్‌‌‌‌‌‌‌‌కు 241 రన్స్‌‌‌‌‌‌‌‌ భారీ భాగస్వామ్యం జోడించిన ఈ జోడీని మూడో సెషన్‌‌‌‌‌‌‌‌ మధ్యలో బుమ్రా విడగొట్టాడు. 83వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో స్మిత్‌‌‌‌‌‌‌‌ను ఔట్‌‌‌‌‌‌‌‌ చేసిన అతను 87వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో నాలుగు బాల్స్‌‌‌‌‌‌‌‌ తేడాలో మిచెల్‌‌‌‌‌‌‌‌ మార్ష్‌‌‌‌‌‌‌‌ (5), హెడ్‌‌‌‌‌‌‌‌ను పెవిలియన్‌‌‌‌‌‌‌‌కు పంపాడు. ఆట చివర్లో సిరాజ్‌‌‌‌‌‌‌‌ దెబ్బకు కమిన్స్‌‌‌‌‌‌‌‌ (20) ఔటైనా.. క్యారీ, స్టార్క్‌‌‌‌‌‌‌‌ మరో వికెట్‌‌‌‌‌‌‌‌ పడకుండా రోజును ముగించారు. .

సంక్షిప్త స్కోర్లు:ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌: 101 ఓవర్లలో 405/7 (హెడ్‌‌‌‌‌‌‌‌ 152, స్మిత్‌‌‌‌‌‌‌‌ 101, బుమ్రా 5/72).