ఇండియాతో టెస్ట్‌‌‌‌‌‌‌‌ సిరీస్‌‌‌‌‌‌‌‌కు గ్రీన్‌‌‌‌‌‌‌‌ డౌటే

లండన్‌‌‌‌‌‌‌‌ : ఆస్ట్రేలియా ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌ కామెరూన్‌‌‌‌‌‌‌‌ గ్రీన్‌‌‌‌‌‌‌‌.. ఇండియాతో ఐదు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల టెస్ట్‌‌‌‌‌‌‌‌ సిరీస్‌‌‌‌‌‌‌‌లో ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధ పడుతున్న గ్రీన్‌‌‌‌‌‌‌‌.. ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ టూర్‌‌‌‌‌‌‌‌ నుంచి అర్ధాంతరంగా వైదొలిగాడు. స్వదేశానికి బయలుదేరనున్న ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌ అక్కడ మరిన్ని పరీక్షలు చేయించుకోనున్నాడు. వాటి ఫలితాలను బట్టి ఇండియాతో సిరీస్‌‌‌‌‌‌‌‌లో ఆడటంపై నిర్ణయం తీసుకోనున్నాడు.

 బుధవారం ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌తో జరిగిన మూడో వన్డేలోనే గ్రీన్‌‌‌‌‌‌‌‌ తీవ్రమైన నొప్పికి గురయ్యాడు. వెంటనే చికిత్స తీసుకున్నా పెద్దగా ఫలితం కనిపించలేదు. దీంతో శుక్రవారం జరిగిన  నాలుగో వన్డేలో ఆడలేదు.