ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభం కుదిపేస్తున్న రోజులవి. అమెరికా సహా పెద్ద దేశాలూ దాని ధాటికి కుదేలయ్యాయి. ఆ ఆర్థిక సంక్షోభం టైంలోనే 1939 డిసెంబర్ 15న ఈ జంట ఒక్కటైంది. అది మొదలు వారి సంసారం 80 ఏళ్లుగా ఏ చీకూ చింతా లేకుండా సాగుతోంది. వచ్చే నెలలోనే వాళ్ల 80వ పెళ్లిరోజు. అందుకేనేమో వాళ్లు గిన్నిసోళ్ల కళ్లలో పడ్డట్టున్నారు. ప్రపంచంలోనే వృద్ధ దంపతులుగా గిన్నిస్ రికార్డు పట్టేశారు. ఆ అన్యోన్య దంపతుల పేర్లు జాన్ హెండర్సన్, చార్లెట్. ఆయనకు 106 ఏళ్లయితే, ఆమెకు 105 ఏళ్లు. అమెరికాలోని టెక్సస్‌లో ఉంటున్నారు వాళ్లు. బతికినన్నాళ్లు హుందాగా, గౌరవంగా బతికితే చాలంటారు హెండర్సన్. అంతేకాదు, ఉన్నన్నాళ్లు భార్యను భర్త, భర్తను భార్య ప్రేమిస్తే ఆ కాపురం హాయిగా సాగుతుందంటారు. నిజానికి వాళ్లు 1934లో యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్‌లో కలిశారట. ఆయన ఫుట్‌బాల్ ప్లేయర్ అట. ఆమేమో టీచర్ కావడానికి క్లాసులకు వెళ్లేవారట. అలా అలా వాళ్లకు పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారట.

