మెల్‌బోర్న్: బాక్సింగ్ డే టెస్టు మొదటి రోజు ఆసీస్ బ్యాటర్ కాన్‌స్టస్‌ను భుజంతో ఢీకొని విమర్శలు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీని రెండో రోజు ఆతిథ్య అభిమానులు ఇబ్బంది పెట్టారు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో, బ్యాటింగ్ చేస్తుండగా గట్టిగా అరుస్తూ అతని ఏకాగ్రత దెబ్బతీసే ప్రయత్నం చేశారు. ఔటైన తర్వాత డ్రెస్సింగ్ రూంకు వెళ్తుండగా కొంత మంది కోహ్లీని ఎగతాళి చేశారు. అతనిపై కొన్ని కామెంట్లు కూడా చేశారు.
దాంతో వెనక్కి వచ్చిన విరాట్ ఫ్యాన్స్ వైపు చూస్తూ అసహనం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఫ్యాన్స్ విరాట్‌పై ఎలాంటి కామెంట్లు చేశారన్నది మాత్రం వీడియోలో క్లారిటీ లేదు. అంతకుముందు తొలి సెషన్‌లో ఓ అభిమాని గ్రౌండ్‌లోకి వచ్చి కోహ్లీ భుజంపై చేయి వేశాడు.
Virat Kohli almost recreated that incident with a CSK fan at Wankhede ?? pic.twitter.com/35qDBKxuv3
— Pari (@BluntIndianGal) December 27, 2024