బీసీ గురుకులానికి 20 ఫ్యాన్లు అందజేత

మక్తల్, వెలుగు: ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సేవా సమితి ఆధ్వర్యంలో గురుకుల పాఠశాలకు మంగళవారం 20 ఫ్యాన్లను అందజేశారు. టౌన్ కాంగ్రెస్  ప్రెసిడెంట్ బోయ రవి కుమార్, కాంగ్రెస్ నాయకులు ఫ్యాన్లను తీసుకురాగా వాటిని ఎమ్మెల్యే చేతుల మీదుగా బీసీ బాలుర గురుకులానికి అందజేశారు.

 ఆగస్టు14 న ఎమ్మెల్యే బీసీ గురుకుల పాఠశాలలో నిద్ర చేశారు. అప్పుడు విద్యార్థులు ఫ్యాన్లు లేవని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.  టౌన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఫ్యాన్లను పాఠశాలకు అందించారు.  

గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా అందరు కలిసి రావాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు లక్ష్మారెడ్డి, కట్టా సురేశ్ గుప్తా, గణేశ్ కుమార్, ఆనంద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.