మైండ్ బ్లాంక్.. వేలంలో రూ. 510 కోట్లు పలికిన వైన్‌షాపు 

మైండ్ బ్లాంక్.. వేలంలో రూ. 510 కోట్లు పలికిన వైన్‌షాపు 

దేశంలోని ప్రతి రాష్ట్రంలో వైన్ షాపుల కోసం వేలంపాట నిర్వహించడం సాధారణం. వైన్ షాపు కావాలనుకునే వాళ్లు తమకు తోచినంత వేలంపాడి దక్కించుకుంటారు. ఈ పద్దతిలోనే రాజస్థాన్‌లో కూడా లిక్కర్ షాపుల వేలంపాట ఆన్‌లైన్‌లో సోమవారం నిర్వహించారు. గతంలో ఇక్కడ ఆన్‌లైన్ వేలంపాటను మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే రద్దు చేశారు. కానీ, మళ్లీ ఈ వ్యవస్థను ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ పునరుద్దరించారు. దాంతో మళ్లీ రాష్ట్రంలో ఆన్‌లైన్ వేలంపాట అందుబాటులోకి వచ్చింది.

సోమవారం నిర్వహించిన ఆన్‌లైన్ వేలంపాటలో హనుమాన్‌గర్ జిల్లాలోని నోహార్‌లోని ఒక వైన్ షాపు ఊహించనంత ధరకు కోట్ అయింది. ఈ షాపు ప్రభుత్వ ధర రూ. 72 లక్షలు కాగా.. ఈ షాపును బిడ్డర్లు ఏకంగా రూ. 510 కోట్లకు దక్కించుకున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ వేలంపాట అర్దరాత్రి 2 గంటల వరకు కొనసాగింది. ఈ వైన్ షాపును ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు దక్కించుకోవడం విశేషం. ఈ లిక్కర్ షాపు ఇంత ధరకు కోట్ అవుతుందని ఊహించలేదని ఎక్సైజ్ శాఖ అధికారులు అంటున్నారు. ఈ షాపు ప్రారంభ ధర రూ. 72 లక్షలు కాగా.. దానికి 708 రెట్ల ధరకు కోట్ కావడం గమనార్హం.