హైదరాబాద్, వెలుగు: ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎన్నో ఫీచర్లతో లైట్ (లైవ్ -ఇట్ -టుడే) క్రెడిట్ కార్డ్‌ను లాంచ్ చేసింది. క్రెడిట్ కార్డ్ కంపెనీలు కో–బ్రాండెడ్ కార్డుల ద్వారా ఆకర్షణీయమైన ప్రోడక్టులను అందిస్తున్నప్పటికీ, తమ కార్డ్‌లో అటువంటి అన్ని ఫీచర్లూ కలసి ఉంటాయని బ్యాంకు తెలిపింది. లైట్ కస్టమర్‌లకు ఒక క్వార్టర్లో ఒకటి లేదా రెండుసార్లు లాంజ్ యాక్సెస్ ఉంటుంది. మైల్‌స్టోన్ ప్రోగ్రామ్ ద్వారా ఎక్కువ రివార్డ్ పాయింట్లు/క్యాష్‌బ్యాక్‌లను పొందవచ్చు. ఓటీటీ & లైఫ్‌స్టైల్ మెంబర్‌షిప్‌ల ద్వారా వివిధ ప్లాట్‌ఫామ్‌ల కంటెంట్‌ను ఉచితంగా చూడొచ్చు. యాక్సిలరేటెడ్ రివార్డ్‌ల (ఆన్‌లైన్/ఆఫ్‌లైన్) వల్ల ఆన్‌లైన్, పీఓఎస్ లావాదేవీలపై అధిక రివార్డ్ పాయింట్‌లను పొందవచ్చు.
