సిటీలో మరో మూడు అటమ్‌ ఈవీ చార్జింగ్ స్టేషన్లు

సిటీలో మరో మూడు అటమ్‌ ఈవీ చార్జింగ్ స్టేషన్లు

హైదరాబాద్‌లో మరో మూడు ఈవీ చార్జింగ్ స్టేషన్స్ ను అందుబాటులోకి తెచ్చింది విశాక ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ అటమ్. ఎర్రగడ్డ, ఆర్సీపురం, జీడిమెట్లలో ఇవాళ మూడు ఈవీ చార్జింగ్ స్టేషన్స్ ప్రారంభించింది. హైదరాబాద్‌లో మొత్తం 11 అటమ్ ఈవీ చార్జింగ్ స్టేషన్స్ ప్రారంభిస్తామని తెలిపింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతుండటంతో సామాన్యుడు వాహనాన్ని బయటకు తీయలేని పరిస్థితి నెలకొందన్నారు  ఎస్‌ఎస్‌ ఏజెన్సీస్ ప్రొప్రెటర్ జస్మత్ భాయ్ పటేల్. ఫ్యూచర్ అంతా ఎలక్ట్రిక్ వెహికిల్స్ హవా ఉంటుందన్నారు. అటమ్ నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ బైక్‌కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు. తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు పెరుగుతున్నాయన్నారు విశాక ఇండస్ట్రీస్ వైస్ ప్రెసిడెంట్ అజయ్. ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకంతో పొల్యూషన్ ఫ్రీతో పాటు ఫ్యూయల్ ఖర్చులు ఉండవన్నారు.