6 నెలల్లో 250 ఛార్జింగ్ స్టేషన్లు పెట్టిన ఆటమ్

6 నెలల్లో 250 ఛార్జింగ్ స్టేషన్లు పెట్టిన ఆటమ్

హైదరాబాద్, వెలుగు: సోలార్ పవర్​తో ఈవీ ఛార్జింగ్ సొల్యూషన్స్ అందించే హైదరాబాద్​ కంపెనీ ‘ఆటమ్ ఛార్జ్’ కేవలం ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా 250 యూనివర్సల్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ల ఇన్​స్టాలేషన్​ను పూర్తి చేసినట్లు తెలిపింది. మహారాష్ట్రలో 36, తమిళనాడులో 44, తెలంగాణలో 48, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్​లో 23 చొప్పున, ఉత్తరప్రదేశ్​లో 15, హర్యానాలో 14, ఒడిశాలో 24 స్టేషన్లు ఏర్పాటు చేశామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. చిన్న పట్టణాలు,  నగరాలల్లో ఛార్జింగ్ నెట్​వర్క్​ను పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ ప్రకటించింది. రాబోయే నెలల్లో మరిన్ని నగరాల్లో ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. గత ఏడాది సెప్టెంబర్లో  తొలిసారిగా ఆటమ్..హైదరాబాద్​లో ఛార్జింగ్ సౌకర్యాన్ని కంపెనీ ఏర్పాటు చేసింది.  ఇంటిగ్రేటెడ్ సోలార్ రూఫ్ నుంచి తీసుకునే సోలార్ పవర్ ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్స్​ను ఛార్జ్ చేయడం ఆటమ్​ ప్రత్యేకత ‘‘సాధారణ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు థర్మల్ పవర్​ను ఉపయోగించి కరెంటును తీసుకుంటాయి. దీనివల్ల  పవర్ గ్రిడ్​పై అదనంగా ఒత్తిడి ఉంటుంది. మేం పూర్తిగా సోలార్ పవర్​తోనే ఛార్జ్ చేస్తాం. 250 ఛార్జ్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ప్రారంభించడం ద్వారా దేశంలో ఈవీ ఎకోసిస్టమ్​కు సపోర్ట్​ చేస్తున్నాం. థర్మల్ పవర్ స్టేషన్లను తొలగించి వాటి స్థానంలో సోలార్ పవర్​తో నడిచే స్టేషన్లను ఏర్పాటు చేయడం మా టార్గెట్. పర్యావరణాన్ని కాపాడేందుకు   ఇంపార్టెన్స్ ఇస్తాం. కాలుష్య నిర్మూలనకు మా వంతు సాయపడతాం’’ అని ఆటమ్ ఛార్జ్ ఫౌండర్​ వంశీ గడ్డం అన్నారు. కంపెనీ ప్రస్తుతం 4- కిలోవాట్ల కెపాసిటీ ప్యానెళ్లను ఇన్​స్టాల్​ చేసింది. ఇవి అన్ని రకాల ఈవీలను ఛార్జ్ చేస్తాయి.-  ఒక్క ఈవీని ఛార్జ్ చేయడానికి దాదాపు6-–8 గంటల సమయం పడుతుంది. రోజుకు 12 వెహికల్స్​ను ఛార్జ్​ చేయొచ్చు. కంపెనీ త్వరలో 6 కిలోవాట్ల ఛార్జర్లను కూడా ఇన్​స్టాల్​ చేయనుంది. ఒక్కో ఛార్జర్​ రోజుకు 30 వరకు వెహికల్స్​ను ఛార్జ్​ చేస్తుంది. సోలార్​పవర్​ను ఇవ్వడానికి ఆటమ్​ ఛార్జ్​ ఇతర ఛార్జింగ్ స్టేషన్ల​ ఓనర్లతో ఒప్పందాలు కుదుర్చుకుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.