గ్రామాల్లోనే ఉపాధి కల్పనకు కృషి

  • పీఆర్  కమిషనర్  సృజన

గద్వాల, వెలుగు: మంగళవారం ఇటిక్యాల మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీస్ లో ఏర్పాటు చేసిన ప్రజా పాలన ప్రజా విజయోత్సవ గ్రామ సభకు ఆమె చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో గ్రామ సభలను నిర్వహించి ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం చేపట్టిన పనులు, పథకాలను, సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలని సూచించారు. రైతులు, ప్రజలకు అవసరమైన పథకాలు, పనులను గుర్తించి అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పని చేస్తాయన్నారు. 

గ్రామాల అభివృద్ధి కోసం వర్మీ కంపోస్ట్, అజోలా గుంటలు, పొలం బాటలు, పశువుల పాకలు, ఇంకుడు గుంటల నిర్మాణాలు చేపడతామని చెప్పారు. అంతకుముందు ఈజీఎస్​ కింద చేపట్టిన పశువుల కొట్టం, ఎంపీడీవో ఆఫీసులో వర్మీ కంపోస్ట్  గుంటను ప్రారంభించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారత సంవిధాన ప్రతిజ్ఞ చేశారు. జడ్పీ సీఈవో కాంతమ్మ, డీపీవో శ్యాంసుందర్‌, ఎంపీడీవో అజర్  మొహినుద్దీన్‌, పీఆర్​ ఈఈ దామోదర్ రావు పాల్గొన్నారు.

 ప్రతి విలేజ్​లో ఈజీఎస్​ పనులు ప్రారంభించాలి

పెబ్బేరు: వనపర్తి జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఈజీఎస్​ పనులను వెంటనే ప్రారంభించాలని పంచాయతీరాజ్​ కమిషనర్​ సృజన అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆమె వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలో పర్యటించారు. జనుంపల్లి గ్రామంలో మన ఊరిలో పనుల జాతర కార్యక్రమాన్ని ప్రారంభించారు. పశువుల పాక నిర్మాణ పనులను ప్రారంభించి, రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అధికారులు, గ్రామస్తులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు.

అనంతరం మల్టీపర్పస్  వర్కర్లు, ఉపాధి కూలీలను ఆమె శాలువాలతో సత్కరించారు. జడ్పీ సీఈవో యాదయ్య, డీఆర్డీవో ఉమాదేవి, మండల స్పెషల్​ ఆఫీసర్​ నాగేంద్రం, డీఎల్పీవో రఘునాథ్ రెడ్డి, ఎంపీడీవో రవీంద్ర, ఏఈ మల్లయ్య, డీఈ శ్రీనివాసులు, ఎంపీవో రోజా, డీటీ లక్ష్మీకాంత్, పంచాయతీ కార్యదర్శి నాగభూషణం పాల్గొన్నారు.