కాకినాడజిల్లాలో దారుణం..  ఇరువర్గాల మధ్య కత్తులతో దాడి.. ముగ్గురు మృతి

ఓ పక్క దీపావళి సంబరాలు జరుగుతుంటే  మరోపక్క కాకినాడ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కాజలూరు మండలం శలపాకలో ఇరు వర్గాలు దాడి చేసుకున్నాయి.  వీరిమధ్య పాతకక్షలు ఉండటంతో అదును చూసి కత్తులతో దాడి చేసుకున్నారు,  ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.   కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతులు బత్తుల రమేశ్‌, బత్తుల చిన్ని, బత్తుల రాజుగా గుర్తించారు.కాకినాడ ఎస్పీ విక్రాంత్ పాటిల్ కూడా ఘటనా స్థలికి చేరుకుని దాడి ఘటనపై ఆరా తీశారు.