కోర్టు ఉద్యోగిపై దాడి

ఇబ్రహీంపట్నం, వెలుగు: ఇబ్రహీంపట్నం కోర్టులో జూనియర్ అసిస్టెంట్‌‌గా పనిచేస్తున్న నిఖిల్ గోవింద్‌‌పై  కోర్టు ఆవరణలో దాడి జరిగింది.  దీనిపై 15వ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు సీనియర్ సూపరింటెండెంట్  ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు.  సీఐ మధు కథనం ప్రకారం..శనివారం నిఖిల్ గోవింద్‌‌ పై అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఆఫీస్ సబార్డినేట్‌‌గా పనిచేస్తున్న  ఇందు బంధువులు, తల్లి దాడి చేశారు. నిఖిల్ గోవింద్,  ఇందు ప్రేమించుకుంటున్నారు.  కేసు నమోదు చేశారు.