నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం.. అనుమానంతో భార్యని హత్య చేసిన భర్త

అనుమానంతో భార్యని  భర్త హత్య చేసిన ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..  నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన రాజు కు జ్యోతి(35) తో 17 ఏళ్ళ క్రితం వివాహం జరిగింది. భార్య,కూతురుతో కలిసి మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురం అగ్రికల్చర్ కాలనీలోనీ ఓ అపార్ట్ మెంట్ లో  రాజు నివాసం ఉంటున్నాడు. కొన్నాళ్లు సజావుగా సాగిన సంసారంలో అనుమానం అనే పెనుభూతం ఎంటరైంది.

 ఈ క్రమంలో భార్య జ్యోతి పై అనుమానం పెంచుకుని తరచూ గొడవ  పడేవాడు. ఈ క్రమంలో గురువారం గొడవ జరగ్గా రాజు ఇనుప రాడ్ తో  జ్యోతి తలపై మోది హత్య చేశాడు. ఈ దాడిలో తీవ్ర రక్త స్రావానికి గురైన జ్యోతి అక్కడికక్కడే మృతి చెందింది. హత్య  అనంతరం రాజు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.