Baby John Vs Pushpa 2: బాలీవుడ్లో పుష్ప 2 Vs బేబీ జాన్‌.. డైరెక్టర్ అట్లీ ఏమన్నాడంటే?

షారుక్ ఖాన్‌ జవాన్‌తో రికార్డులు కొల్లగొట్టారు డైరెక్టర్ అట్లీ (Atlee). ఇప్పుడు బేబీ జాన్‌(Baby John) సినిమాతో వరుణ్ ధావన్‌ హీరోగా అట్లీ ప్రేక్షకుల ముందుకోస్తున్నాడు. ఈ మూవీ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ కానుంది.

ఈ నేపథ్యంలో అట్లీ వరుస ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. ఇటీవల ముంబైలో జరిగిన ప్రెస్ మీట్‌లో పుష్ప 2తో బేబీ జాన్‌కు గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉందంటూ.. ఓ రిపోర్టర్ అట్లీని ప్రశ్నించాడు. అంతేకాకుండా పుష్ప 2: ది రూల్ ప్రపంచవ్యాప్తంగా రికార్డ్లు కొనసాగిస్తోంది.. ఇప్పటికే 1400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ముఖ్యంగా హిందీలోనే ఎక్కువ కలెక్షన్స్తో దూసుకెళ్తోంది. అలాంటిది పుష్ప 2 కి పోటీగా వస్తుడటం.. రిస్క్ అనిపించట్లేదా? అని రిపోర్టర్ అడిగాడు.

Also Read:-అంబేద్కర్ పేరెత్తితే అలర్జీ వస్తుందనుకుంటా.. అమిత్ షాకు విజయ్ స్ట్రాంగ్ కౌంటర్..

ఈ ప్రశ్నకు  డైరెక్టర్ అట్లీ సమాధానమిస్తూ.. " పుష్ప 2తో పోటీ ఉన్నప్పటికీ.. బేబీ జాన్ విజయంపై నమ్మకం ఉంది. మేమంతా ప్రొఫెషనల్స్‌గా మంచి ఆలోచనతో ఉన్నాం. నాకు అల్లు అర్జున్తో మంచి స్నేహం ఉంది. పుష్ప 2 డిసెంబర్ 5న వస్తే.. మేం డిసెంబరు నాలుగో వారంలో వస్తున్నాం.. మా బేబీ జాన్ సినిమాకి పుష్ప 2కి మధ్య ఎటువంటి ఘర్షణ లేదు. అయితే, పుష్ప 2 ఆగష్టు నుండి డిసెంబర్‌కు మారిందని మాకు తెలుసు. ఇప్పటికే.. అల్లు అర్జున్ బేబీ జాన్ సినిమా గురించి మాట్లాడుతూ నన్ను అభినందించి, వరుణ్‌తో మాట్లాడారు" అంటూ డైరెక్టర్ అట్లీ స్పందించారు. 

ఇటీవలే.. అల్లు అర్జున్ అరెస్ట్ కావడంపై బేబీ జాన్ మూవీ ప్రమోషన్స్‎లో భాగంగా వరుణ్ మాట్లాడుతూ.."అల్లు అర్జున్ అరెస్ట్ కావడం దురదృష్టకరం.సేఫ్టీ ప్రోటోకాల్‌ విషయంలో యాక్టర్ ఒక్కరే అన్ని విషయాలు చూసుకోలేరు.. ఘటనకు ఒక్కరినే బాధ్యుడిని చేయడం సరికాదు’’ అని వరుణ అన్నారు. 

బేబీ జాన్‌ సినిమా విషయానికి వస్తే.. ప్రముఖ జీ స్టూడియోస్‌‌‌‌తో కలిసి డైరెక్టర్ అట్లీ నిర్మిస్తున్నాడు. కీర్తి సురేష్​ ఈ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. వామికా గబ్బి మరో హీరోయిన్. కాలీస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో సల్మాన్ ఖాన్‌‌‌‌ గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడు. 2016 లో హీరో విజయ్‌‌‌‌తో అట్లీ తీసిన తమిళ చిత్రం ‘తేరి’కి ఇది రీమేక్.