హైదరాబాద్‌లో రెండవ స్టోర్‌‌ను ప్రారంభించిన ఏథర్ ఎనర్జీ

హైదరాబాద్‌లో రెండవ స్టోర్‌‌ను ప్రారంభించిన ఏథర్ ఎనర్జీ

హైదరాబాద్‌లోని నాగోల్‌ లో తమ రెండవ రిటైల్‌స్టోర్‌ ను ప్రారంభించింది  ప్రైడ్‌ మోటర్స్‌, ఎథర్‌ ఎనర్జీ.  భారతదేశంలో అత్యంత వేగవంతమైన ,స్మార్టెస్ట్‌ స్కూటర్‌లలో ఒకటైన ఎథర్‌ 450 ఎక్స్‌తో పాటుగా ఎథర్‌450 ప్లస్‌లు ఇప్పుడు ఎథర్‌ స్పేస్‌ వద్ద టెస్ట్‌ రైడ్‌  కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి.ఈ సందర్భంగా ఎథర్‌ ఎనర్జీ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌   శ్రీ రవ్నీత్‌ సింగ్‌ ఫోఖేలా  మాట్లాడుతూ.. ‘‘ఇటీవలి కాలంలో విద్యుత్‌ వాహనాలకు డిమాండ్‌ గణనీయంగా పెరిగింది. అక్టోబర్‌ అమ్మకాల పరంగా  గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఎథర్‌ ఎనర్జీ అమ్మకాలు 12 రెట్లు వృద్ధి చెందాయి. తెలంగాణాలో  7500 విద్యుత్‌ వాహనాలు, ప్రధానంగా ద్వి చక్రవాహనాల విక్రయాలు అక్టోబర్‌లో జరిగినట్లుగా నమోదయ్యాయి.  మాకు అత్యంత కీలకమైన మార్కెట్‌ తెలంగాణా. ఇప్పుడు మేము రాష్ట్రమంతా విస్తరించడంతో పాటుగా పెరుగుతున్న డిమాండ్‌ను అందుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు.

ప్రైడ్‌ మోటర్స్‌ ఛైర్మన్‌ ఎం సురేష్‌ రెడ్డి మాట్లాడుతూ ‘‘గత సంవత్సరకాలంగా ఎథర్‌ ఎనర్జీతో మా భాగస్వామ్య ప్రయాణం ఉత్సాహపూరితంగా ఉంది. హైదరాబాద్‌లో మా రెండవ ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రం తెరిచామని వెల్లడిస్తుండటం  సంతోషంగా ఉన్నాం. నూతన సాంకేతికతలను స్వీకరించడంలో హైదరాబాద్‌ వినియోగదారులు చురుగ్గా ఉన్నారు. విద్యుత్‌ ద్వి చక్రవాహన రంగంలో విప్లవాత్మక సాంకేతికతలను తీసుకురావడంలో  ఎథర్‌ ఎంతో ముందుంది.