అథేర్ అనర్జీ కొత్త ఎలక్ట్రిక్ స్మార్ట్ స్కూటర్ ‘అథేర్ 450X’

అథేర్ అనర్జీ కొత్త ఎలక్ట్రిక్ స్మార్ట్ స్కూటర్ ‘అథేర్ 450X’

భారతదేశం యొక్క మొట్టమొదటి స్మార్ట్ స్కూటర్ తయారీదారు,అథేర్ అనర్జీ, తన 2వ దశ విస్తరణలో భాగంగా అథేర్ 450X ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. అథేర్ ఎనర్జీ ఉత్పత్తులకు ఉన్న అధిక డిమాండ్, డీలర్ షిప్ అభ్యర్థనలు, టెస్ట్ రైడ్స్ కోసం కోసం వస్తున్న లెక్కలేనన్ని అభ్యర్థనల కారణంగా అథేర్ ఎనర్జీ 2 వ దశలో ఈ కొత్త స్కూటర్ ను మార్కెట్లలోకి విస్తరించడానికి పూనుకుంది. జాతీయ స్థాయిలో పెరగనున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని అథేర్ ఎనర్జీ తన విస్తరణ ప్రణాళికలను మరింత వేగవంతం చేసింది. 2021 క్యూ1 లో దేశంలోని 26 నగరాల్లో అథేర్ 450X ను అందుబాటులోకి తేనుంది.

అథేర్ 450X అన్నది ఇదివరకటి అథేర్ 450 యొక్క అప్ గ్రేడ్ చేయబడిన మోడల్. ఇది ప్రస్తుతం భారత దేశంలో ఉన్న అన్ని స్కూటర్లకంటే వేగంగా నడిచే మరియు స్మార్టెస్ట్ స్కూర్టర్లలో ఒకటి. ఇది మూడు కొత్త రంగుల్లో లభ్య‌మవుతోంది: గ్రే, గ్రీన్, వైట్. ఇది 6kW పిఎంఎస్ఎం మోటార్ , 29 కిలోవాట్ల లిథియం అయోన్ బ్యాటరీ కలిగి ఉంటుంది. దీనికి 4 రైడింగ్ మోడ్స్ ఉంటాయి. ప్రస్తుతం ఉన్న ఏకొ, రైడ్, మరియు స్పోర్ట్ మోడ్స్ తో పాటు అథేర్ అదనంగా ‘ర్యాప్’ అనే హై పెర్ఫామెన్స్ మోడ్ ను కలిగి ఉంది. అథేర్ 450X ఈ ‘ర్యాప్’ మోడ్ లో కేవలం 3.3సెకన్లలో 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఇదే దీని 125 సిసిలో కేటగిరీలో అత్యంత వేగవంతమైన స్కూటర్‌గా చేస్తుంది. సిటీ ట్రాఫిక్ లో నిశ్చింతగా దూసుకువెళ్లడానికి ఇది ఒక చక్కటి ఎంపిక. అథేర్ 450X ఇదివ‌ర‌క‌టి కంటే 50% వేగంగా చార్జింగ్ కావడంతో పాటు, నిముషానికి 1.5 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో ప్రస్తుతానికి ఇదే వేగవంతమైన ఛార్జింగ్ రేటుగా నిలిచింది.

దాంతో పాటు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్లూ టూత్ కనెక్టివిటీ తో కూడిన 4జి సిమ్ కార్డ్ కలిగి ఉంది. దాంతో వాహనదారులు ప్రయాణం చేస్తూనే డ్యాష్ బోర్డ్ కు ఉన్న టచ్ స్క్రీన్ ద్వారా ఫోన్ కాల్స్ మాట్లాడవచ్చు, తమకు ఇష్టమైన సంగీతాన్ని వినవచ్చు. దీని సరికొత్త 7” టచ్ స్క్రీన్ డ్యాష్ బోర్డ్ 16ఎం కలర్ డెప్త్ కలిగి ఉండడమేగాక ఇండ్లో స్నాప్ డ్రాగాన్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ కలిగి ఉంది.

అథేర్ 450X గూగుల్ మ్యాప్ నేవిగేషన్ కొరకు ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ను ఉపయోగించుకుంటుంది, దాంతో పాటు ఆన్ బోర్డ్ డయాగ్నోస్టిక్స్, ఓవర్ ద ఎయిర్ నవీకరణలు, ఆటో ఇండికేటర్ ఆఫ్ మరియు గైడ్ మీ హోమ్ లైట్స్ వంటి ప్రత్యకమైన ఏర్పాట్లను కూడా కలిగి ఉంది. అథేర్ మొబైల్ యాప్ మీకు పర్సనలైజ్డ్ గణాంకాలు, చార్జింగ్ స్టేటస్, పుష్ నేవిజేషన్, ఇంకా తెఫ్ట్ అండ్ టో డెటెక్షన్, లైవ్ లొకేషన్ మరియు వెహికిల్ స్టేట్ ట్రాకింగ్ వంటి అదనపు ఫంక్షన్స్ కూడా కలిగి ఉంది.

ఈ స్మార్ట్ స్కూట‌ర్ మొత్తం 16 నగరాలు –అనగా మైసూర్, హుబ్లీ, జైపూర్, ఇందూర్, పనాజీ, భువనేశ్వర్, నాసిక్, సూరత్, చండీఘర్, విజయవాడ, విశాఖపట్నం, గువాహతీ, నాగ్పూర్, నోయిడా, లక్నో మరియు సిలిగురీ లో ల‌భ్యం కానుంది