హైదరాబాద్ సిటీలో కరెంట్ స్కూటర్ల షోరూం!

హైదరాబాద్ సిటీలో కరెంట్ స్కూటర్ల షోరూం!

బెంగళూరు: ప్రముఖ ఎలక్ట్రిక్‌‌ స్కూటర్ల తయారీ సంస్థ ఎథర్‌‌.. హైదరాబాద్‌‌, ముంబై, ఢిల్లీ, పుణే వంటి టయర్‌‌–1 నగరాల్లో షోరూమ్‌‌లను ఏర్పాటు చేయనుంది. ఎక్స్‌‌పీరియన్స్‌‌ సెంటర్స్‌‌ ఏర్పాటుకు డీలర్ల నుంచి బిడ్స్‌‌ను ఆహ్వానించింది. ఇక్కడ ఎథర్‌‌ ఈ–స్కూటర్లను టెస్ట్‌‌రైడ్‌‌ చేయొచ్చు.

ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం కంపెనీ ఇది వరకే తమిళనాడు ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది.  బెంగళూరు, చెన్నైలో ఈ కంపెనీకి ఎక్స్‌‌పీరియెన్స్‌‌ సెంటర్లు ఉన్నాయి. కంపెనీ ఇటీవల ‘ఎథర్‌‌ 450’ పేరుతో ఫ్లాగ్‌‌షిప్‌‌ స్కూటర్‌‌ను లాంచ్‌‌ చేసింది. అన్ని మెట్రో నగరాల్లో ఛార్జింగ్‌‌ స్టేషన్లను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపింది.