న్యూఢిల్లీ: గ్లోబల్ మార్కెట్లలో క్రూడ్ ధరలు తగ్గడంతో దేశీయంగా జెట్ ఫ్యూయెల్ (ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్) రేట్లను 2.2 శాతం తగ్గించారు. కిలో లీటర్ ఏటీఎఫ్ధరను రూ. 3,084.94 దాకా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తగ్గించాయి. దీంతో ఏటీఎఫ్ రేట్లు కిలో లీటర్కు రూ. 1,38,147 కి దిగి వచ్చాయి. ఈ ఏడాది ఏటీఎఫ్ రేట్లు తగ్గడం ఇది రెండోసారి. ప్రతీ నెలా రెండుసార్లు ఏటీఎఫ్ రేట్లను సవరిస్తారు. జులై 1 న ఏటీఎఫ్ రేట్లలో ఎలాంటి మార్పూ ప్రకటించలేదు. ఏడాది మొదటి నుంచి చూస్తే ఏటీఎఫ్ రేట్లను 11 సార్లు పెంచారు. దీంతో ఆరు నెలల్లోనే ధరలు రెట్టింపయ్యాయి.
