ముంబైలో విషాదం.. సముద్రంలో బోటు ప్రమాదం.. ‘ఎలిఫెంటా కేవ్స్’కు 80 మందితో వెళుతుండగా ఘటన

ముంబై: ఆర్థిక రాజధాని ముంబై నగరంలో విషాద ఘటన జరిగింది. ముంబైలోని ‘గేట్ వే ఆఫ్ ఇండియా’ ప్రాంతం నుంచి ‘ఎలిఫెంటా కేవ్స్’కు 80 మందికి పైగా ప్రయాణికులతో వెళుతున్న ఫెర్రీ బోట్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. 80 మందిలో 77 మందిని రెస్క్యూ టీం సురక్షితంగా కాపాడింది. బుధవారం సాయంత్రం 3.15కి ముంబై ‘గేట్ వే ఆఫ్ ఇండియా’ ప్రాంతం నుంచి ఈ ‘నీల్ కమల్’ బోట్ ప్రయాణికులతో బయల్దేరింది. 3.55 సమయంలో ఈ బోట్ను ఒక చిన్న స్పీడ్ బోట్ ఢీ కొట్టింది. ఇండియన్ నేవీ తక్షణమే స్పందించి సహాయక చర్యలు ముమ్మరం చేసింది.

ALSO READ | ఇప్పుడు వీటితో కూడా చంపుతున్నారా : ఇయర్ఫోన్ కేబుల్స్తో అప్పుడే పుట్టిన బిడ్డను చంపిన తల్లి

సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టింది. కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసుల సహకారంతో రెస్క్యూ ఆపరేషన్ చేసి బోటులో ఉన్న 80 మందిలో 77 మందిని సురక్షితంగా సముద్రం నుంచి బయటకు తరలించారు. ఈ బోట్ ప్రమాదానికి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. 11 నేవీ బోట్లు, మూడు మెరైన్ పోలీస్ బోట్స్, ఒక కోస్టల్ గార్డ్ వెసెల్ తో పాటు నాలుగు హెలికాఫ్టర్లు రెస్క్యూ ఆపరేషన్లో భాగం కావడం గమనార్హం.